మరణ శిక్ష ఖైదీ పరారీ..
బక్సర్: బిహార్‌లోని బక్సర్ సెంట్రల్ జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. శుక్రవారం అర్థరాత్రి తరువాత ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఆరోగ్యం సరిగా లేదనే కారణంతో వీరంతా జైలులోని హాస్పిటల్ వార్డులో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. అక్కడ టాయ్‌లెట్ విండోను బద్దలుకొట్టి పరారైనట్లు అధికారులు వెల్లడించారు.
పరారైన ఐదుగురిలో ఓ ఖైదీ మరణ శిక్ష విధించబడిన వ్యక్తి కాగా.. మరో నలుగురు వివిధ కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నవారు. ప్రదీప్ సింగ్, డియోదరి రాయ్, సోను పాండే, ఉపెందర్ సహ, సోను సింగ్ అనే ఐదుగురు ఖైదీలు పరారైనట్లు అధికారులు వెల్లడించారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.