200 మంది ఖైదీలు పరార్..!! | 200 prisoners escape from Brazilian jail | Sakshi
Sakshi News home page

200 మంది ఖైదీలు పరార్..!!

Published Fri, Sep 30 2016 7:18 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

200 మంది ఖైదీలు పరార్..!!

200 మంది ఖైదీలు పరార్..!!

రియోడిజనిరో: ఒక్కరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా 200 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. ఈ ఘటన వాయువ్య బ్రెజిల్ సోవోపాలోని జార్డినోపొలిస్ జైలులో గురువారం చోటు చేసుకుంది. మెడికల్ చెకప్ సమయంలో కొంతమంది ఖైదీలు తమ వద్దనున్న దుప్పట్లను కాల్చి గందరగోళం సృష్టించారు. అనంతరం ఫెన్సింగ్ ను కత్తిరించారు.

ఇదే అదునుగా 200 మంది ఖైదీలు పరారయ్యారు. పారిపోతున్న మరో వంద మందిని పట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. రంగంలోకి దిగిన ఆర్మీ వారిని పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. 1,080 మంది కెపాసిటీగల జార్డినోపొలిస్ జైలులో 1,864 మంది ఖైదీలున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement