
ఖైదీల విడుదల
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం 284 మంది ఖైదీలకు స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించింది.
284 మందికి స్వేచ్ఛా జీవితం
బెంగళూరు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం 284 మంది ఖైదీలకు స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించింది. క్షణికావేశంలో చేసిన సంఘటనలకు వివిధ జైళ్లలో జీవిత ఖైదీలుగా మగ్గుతున్న 284 మందిని సోమవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని జైళ్లతో పోలిస్తే బెంగళూరులోని పరప్పన కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వారిలో అత్యధికంగా 120 మంది విడుదలయ్యారు.
మైసూరు జైలు నుంచి 53 మంది..
మైసూరు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మైసూరు కేంద్ర కారగారం నుంచి సత్ప్రవర్తన కలిగిన 52 మంది ఖైదీలను జైలు అధికారులు విడుదల చేశారు. 14 సంవత్సరాల జైలు శిక్ష పూర్తి చేసుకున్న 35 మంది పురుషులు, 17 మంది మహిళా ఖైదీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి మహదేవప్ప మాట్లాడుతూ... ఖైదీలు మిగిలిన జీవితాన్ని సుఖశాంతులతో గడపాలని కోరారు.