Sakshi Special Story On Jail Movies In Tollywood - Sakshi
Sakshi News home page

తీర్పు కోసం... 'జైలు చుట్టూ స్టార్స్‌'

Published Wed, Feb 8 2023 5:10 AM | Last Updated on Wed, Feb 8 2023 11:37 AM

Sakshi Special Story On Jail Movies In Tollywood

కొన్ని రోజులుగా కొందరు స్టార్స్‌ జైలు చుట్టూ తిరుగుతున్నారు. అయితే సినిమా జైలు అన్నమాట. ఈ జైలు సెట్‌లో కొందరు స్టార్స్‌ జైలర్లుగా, కొందరు ఖైదీలుగా నటిస్తున్నారు  జైలు బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథలతో వసూళ్ల పరంగా బాక్సాఫీస్‌ కోర్టు ఇచ్చే తుది తీర్పు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇక ఈ చిత్రాల గురించి తెలుసుకుందాం. 

ఖైదీలు పారిపొకుండా ‘జైలర్‌’గా కాపు కాస్తున్నారు హీరో రజనీకాంత్‌. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘జైలర్‌’. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, సునీల్, జాకీష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా కీ రోల్స్‌ చేస్తున్నారు. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్‌ ఖైదీల్లా కనిపిస్తారట. ఈ చిత్రం కోసం చెన్నైలోని ఓ స్టూడియోలో జైలు సెట్‌ను వేసి, ఓ భారీ షెడ్యూల్‌ను చిత్రీకరించారు. ఇక కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘ఘోస్ట్‌’. ఈ సినిమా కథ మేజర్‌గా జైలులోనే సాగుతుంది. జైలు సీన్స్‌ కోసం దాదాపు 6 కోట్ల రూపాయలతో సెట్‌ వేశారు. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్‌ ఖైదీ పాత్రలో కనిపిస్తారని టాక్‌. శ్రీని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

అలాగే నాగచైతన్య హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ‘కస్టడీ’ సినిమా సెట్స్‌పై ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కృతీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. నాగచైతన్య పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా, నేరం మోపబడిన ఖైదీ పాత్రలో కనిపిస్తారట కృతి. ఇక బాలీవుడ్‌లోనూ జైలు కథలు ఉన్నాయి. ‘మున్నాభాయ్‌ ఎమ్‌బీబీఎస్‌ (2004), ‘లగే రహో మున్నా భాయ్‌’ (2006) వంటి హిట్‌ చిత్రాలతో మెప్పించిన సంజయ్‌ దత్, అర్షద్‌ వార్షి తాజాగా మరో సినిమా చేస్తున్నారు. జైలు బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని దర్శకుడు సిద్ధాంత్‌ సచ్‌దేవ్‌ తెరకెక్కిస్తున్నారని ఫస్ట్‌ లుక్‌ చెబుతోంది. ఇక తమిళ హిట్‌ మూవీ ‘ఖైదీ’ (2019) కొంత  జైలు బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుంది.

ఈ సినిమాను హిందీలో అజయ్‌ దేవగన్‌ ‘భోలా’గా రీమేక్‌ చేశారు. సో.. ఈ చిత్రం కూడా జైలు, ఖైదీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ఊహించ వచ్చు. ఈ సినిమాలో నటించడంతో పాటు, దర్శకత్వం కూడా వహించారు అజయ్‌ దేవగన్‌. టబు పోలీసాఫీసర్‌ రోల్‌ చేసిన ఈ సినిమా మార్చి 30న రిలీజ్‌ కానుంది. ఇక ‘హే సినామిక’ చిత్రం తర్వాత కొరియోగ్రాఫర్‌ బృందా మాస్టర్‌ డైరెక్ట్‌ చేసిన మరో ఫిల్మ్‌ ‘థగ్స్‌’. జైలు బ్యాక్‌డ్రాప్‌లో ఖైదీలు, వారి ఆలోచనల నేపథ్యంలో ఈ సినిమా తీశారు.

హ్రిదు, సింహా, ఆర్‌కే సురేష్, మునిష్కంత్‌ నటించిన ఈ చిత్రం తెలుగులో ‘కోనసీమ థగ్స్‌’గా రిలీజ్‌ కానుంది. ఇప్పటివరకూ చెప్పిన చిత్రాలు జైలు చుట్టూ తిరుగుతాయి. కాగా మేజర్‌ బ్యాక్‌డ్రాప్‌ అని చెప్పలేం కానీ కమల్‌హాసన్‌ ‘ఇండియన్‌ 2’, అల్లు అర్జున్‌ ‘పుష్ప: ది రూల్‌’, రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’, ‘రావణాసుర’ చిత్రాల్లో కొన్ని జైలు సీన్స్‌ ఉన్నట్లు తెలిసింది. ఇవే కాదు.. చెరసాల చుట్టూ తిరిగే చిత్రాలు ఇంకొన్ని రానున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement