ఫేస్ బుక్ దొంగను పట్టి ఇచ్చింది | Selfie in stolen clothes gives thief away | Sakshi
Sakshi News home page

ఫేస్ బుక్ దొంగను పట్టి ఇచ్చింది

Published Mon, Jul 21 2014 6:52 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఫేస్ బుక్ దొంగను పట్టి ఇచ్చింది - Sakshi

ఫేస్ బుక్ దొంగను పట్టి ఇచ్చింది

ఆమె దొంగతనం చేసింది. అమెరికాలోని ఇల్లినాయిస్ లో ని ఒక దుకాణం నుంచి ఖరీదైన దుస్తులను చల్లగా దొంగిలించి చిక్కకుండా పోయింది.పోలీసులు ఎంత వెతికినా ఆమె దొరకలేదు. 
 
చివరికి చేసేదేమీ లేక షాప్ ఓనర్ కెర్ట్ విలియమ్స్ పోయిన డ్రస్సుల ఫోటోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. దొంగిలించిన అమ్మాయికి ఇది తెలియదు. దొంగతనం చేసిన దుస్తులను వేసుకుని ఫోటోలు దిగి ఆ సెల్ఫీలను ఫేస్ బుక్ లో పెట్టింది. దీంతో ఎవరో గుర్తించి షాపు యజమానికి ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అరెస్టు చేశారు. 
 
27 ఏళ్ల డేలియల్ సాక్స్ టన్ అనే ఆ మహిళ ఇప్పుడు అరెస్టయింది. ఫేస్ బుక్ తన కొంప ముంచిందని బాధపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement