
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన జ్యోతిక పెళ్లి తరువాత సినిమాలకు దూరమైంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకొని పూర్తిగా కుటుంబ వ్యవహారాలతో బిజీ అయ్యింది. దాదాపు ఆరేళ్ల విరామం తరువాత 36 వయదినిలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్న జ్యోతిక త్వరలో మరో డిఫరెంట్ మూవీ జాక్‌పాట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా సినిమా టైటిల్ పోస్టర్‌ను తన ట్విటర్ ద్వారా రిలీజ్ చేశాడు సూర్య. అయితే ఈ పోస్టర్ పై బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్, సూర్యల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. జాక్‌పాట్ పోస్టర్ సూపర్‌గా ఉందంటూ ట్వీట్ చేశాడు రితేష్. ఆ ట్వీట్‌కు సమాధానంగా ‘సినిమాలో జ్యోతిక నేను ఎలాంటి స్టంట్స్ చేస్తానో అవన్ని చేసింది’ అంటూ రిప్లై ఇచ్చాడు.
2 డి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జ్యోతికతో పాటు సీనియర్ నటి రేవతి మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతమందిస్తున్నారు. తాజాగా జ్యోతిక.. కార్తీ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.
😀 Thank you...!!! 😀 she s done all the same stunts what I can do..! 🤭 https://t.co/MqZsiNU3lj
— Suriya Sivakumar (@Suriya_offl) 30 April 2019