నా జాక్‌పాట్‌ సూర్యనే! | Suriya Is My Jackpot Jyothika Says | Sakshi
Sakshi News home page

నా జాక్‌పాట్‌ సూర్యనే!

Published Mon, Jul 29 2019 7:41 AM | Last Updated on Mon, Jul 29 2019 7:41 AM

Suriya Is My Jackpot Jyothika Says - Sakshi

చెన్నై : నా జాక్‌పాట్‌ సూర్యనే అని అన్నారు నటి జ్యోతిక. వివాహానంతరం ఈమె వరుసగా నటిస్తున్న విషయం తెలిసిందే. కథానాయకి పాత్రకు ప్రాధాన్యత కలిగిన కథా చిత్రాలను ఎంచుకుని నటిస్తున్న జ్యోతిక నటించిన రాక్షసి ఇటీవల తెరపైకి వచ్చి మంచి సక్సెస్‌ను అందుకుంది. తాజాగా నటిస్తున్న చిత్రం జాక్‌పాట్‌. ఇందులో నటి రేవతి ముఖ్య పాత్రను పోషించడం విశేషం. నటుడు సూర్య తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్‌ దర్శకుడు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నైలోని ఒక నక్షత్ర హోటళ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు, చిత్ర నిర్మాత సూర్య మాట్లాడుతూ ఈ వేడుకకు హీరో సంగీతదర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ అని పేర్కొన్నారు. అదేవిధంగా జ్యోతికనే తనకు జాక్‌పాట్‌ అని అన్నారు. ఎలాంటి కాంప్రమైజ్‌ కాకుండా 100 శాతం కాదు 200 శాతం సరిగ్గా చేసే నటి జ్యోతిక అని పేర్కొన్నారు. తన ఎంచుకునే కథలను చాలా ఆలోచించి, ప్రత్యేక దృష్టి పెట్టి ఎంపిక చేసుకుంటోందని అన్నారు. అదే  జ్యోతికకు ఈ జాక్‌పాట్‌ సరైన చిత్రంగా పేర్కొన్నారు. ఇందులో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చూసి ఇవన్నీ ఎలా చేయగలిగిందని ఆశ్చర్యపడ్డానన్నారు. ఈ సన్నివేశాల కోసం జ్యోతిక ఆరు నెలలు సిలంబం (కర్రసాము) నేర్చుకున్నట్లు తెలిపారు. మరోసారి తాను జ్యోతిక నుంచి చాలా నేర్చుకున్నానని సూర్య పేర్కొన్నారు.

నా ప్రయత్నాలకు అండగా..
అనంతరం జ్యోతిక మాట్లాడుతూ తన తొలి నమస్కారం శివకుమార్‌ నాన్నకేనన్నారు. 2డీ.ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థలో రెండేళ్ల తరువాత తాను నటిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. ఇది తనకు చాలా వినూత్న కథా చిత్రం అని పేర్కొన్నారు. ఇలాంటి కథలో తానింతకు ముందెప్పుడూ నటించలేదని చెప్పారు. హీరోలేం చేస్తారో, అవన్నీ ఈ చిత్రంలో తమను చేయమని చెప్పారన్నారు. మహిళలకు పవర్‌ కావాలని, ఈ చిత్ర పాటల్లో అది ఉంటుందని తెలిపారు. దర్శకుడు అన్ని షాట్స్‌ను బ్రహ్మాండంగా తెరకెక్కించారని అన్నారు. నృత్యదర్శకురాలు బృంద ఇందులోని ఒక పాటను ఒకే రోజులో పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందులోని పోరాట సన్నివేశాల కోసం తన భర్త సూర్య చాలా కిట్స్‌ కొనిచ్చారని చెప్పారు. తన ప్రయత్నాలన్నింటికీ ఆయన అండగా నిలుస్తున్నారని అన్నారు. ఆయన లేకుంటే తాను లేనని అన్నారు. తన జాక్‌పాట్‌ సూర్యనేనని జ్యోతిక పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement