లక్‌ అంటే జ్యోతికదే.. | Jyothika Jackpot First Look Poster Released | Sakshi
Sakshi News home page

జ్యోతిక జాక్‌పాట్‌

Published Thu, May 2 2019 7:46 AM | Last Updated on Thu, May 2 2019 9:02 AM

Jyothika Jackpot First Look Poster Released - Sakshi

లక్కు అంటే నటి జ్యోతికదే. వివాహం అయ్యి ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తరువాత కూడా హీరోయిన్‌గా రాణిస్తున్నారు. అదీ హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వివాహానంతరం నటిగా రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక మంచి కథా బలం ఉన్న చిత్రాలే ఎంచుకుంటున్నారు. అలా ఆమె నటించిన 36 వయదినిలే, మగళీర్‌ మట్టుం, కాట్రిన్‌ మొళి చిత్రాలు సక్సెస్‌ సాధించాయి. తాజాగా జ్యోతిక నటిస్తున్న చిత్రానికి జాక్‌పాట్‌ అనే టైటిల్‌ నిర్ణయించారు. గులేభకావళి వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన కల్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జ్యోతిక భర్త, నటుడు సూర్య తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.

ఇందులో నటి రేవతి ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మంగళవారం చిత్ర వర్గాలు విడుదల చేశాయి. ఒక పోస్టర్‌లో జ్యోతిక చాలా స్టైలిష్‌గా నిలబడి ఉండగా, మరో పోస్టర్‌లో జ్యోతిక, రేవతి పోలీస్‌ దుస్తుల్లో నిలబడి ఉన్న దృశ్యం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నాయి. మొత్తం మీద జాక్‌పాట్‌ చిత్రం కూడా పోలీస్‌ ఇతివృత్తంతో కూడినదిగా తెలుస్తోంది. నటుడు యోగిబాబు, మొట్ట రాజేంద్రన్, ఆనంద్‌రాజ్, మన్సూర్‌అలీఖాన్, జగన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఆనందకుమార్‌ ఛాయాగ్రహణను, విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్న ఈ జాక్‌పాట్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం నటి జ్యోతిక తన మరిది కార్తీతో కలిసి జీతు జోసఫ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement