మా ఇద్దరికీ ఈ జాక్‌పాట్‌ స్పెషల్‌ | Jackpot trailer launch in chennai | Sakshi
Sakshi News home page

మా ఇద్దరికీ ఈ జాక్‌పాట్‌ స్పెషల్‌

Published Sun, Jul 28 2019 3:07 AM | Last Updated on Sun, Jul 28 2019 3:07 AM

Jackpot trailer launch in chennai - Sakshi

‘జాక్‌పాట్‌’ ఆడియో వేడుకలో శివకుమార్, జ్యోతిక, సూర్య తదితరులు

జ్యోతిక, రేవతి ముఖ్య తారాగణంగా నటించిన చిత్రం ‘జాక్‌పాట్‌’. 2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్య నిర్మించిన ఈ చిత్రానికి కల్యాణ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్, ఆడియో విడుదల వేడుక చెన్నైలో జరిగింది. శనివారం తెలుగు ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఆగస్టులో చిత్రం విడుదలకు ప్లాన్‌ చేశారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ – ‘‘జాక్‌పాట్‌’ నాకు, జ్యోతికకూ స్పెషల్‌ ఫిల్మ్‌. ముఖ్యంగా నాకు చాలా స్పెషల్‌. వేరే నిర్మాతలు ఎవరు తీసినా సరిగా రాదేమోనన్న భయంతో నా బ్యానర్‌పై నేనే నిర్మించాను.

జ్యోతిక, రేవతిగారిని ఈ సినిమాలో చూస్తుంటే ఇద్దరు స్టార్‌ హీరోలు కలిసి ఏదైనా మల్టీస్టారర్‌ మూవీ చేశారా? అనిపిస్తోంది. ఇద్దరూ అద్భుతంగా నటించారు. మా బ్యానర్‌కు మరో హిట్‌ రాబోతుందని నమ్ముతున్నాను. నా సినిమాలను ఆదరిస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్న తెలుగు ప్రేక్షకులు ఈ ‘జాక్‌పాట్‌’  సినిమాను హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత మా సొంత బ్యానర్‌లో సినిమా చేశాను. ఈ సినిమాలోని యాక్షన్‌ కోసం చాలా స్టంట్స్‌ చేయాల్సి వచ్చింది. ముందు కాస్త భయపడినా మా ఇంట్లోనే ఉన్న యాక్షన్‌ హీరో (హీరో, జ్యోతిక భర్త సూర్య) నన్ను ప్రోత్సహించారు. అందువల్ల ఫైట్స్‌ చేయగలిగాను. రేవతిగారితో కలిసి నటించడం హ్యాపీ’’ అన్నారు జ్యోతిక. ఈ సినిమాకు విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement