ప్రచారంలో తప్పు లో కాలేసిన ఇరు పార్టీలు
Published Thu, May 12 2016 9:53 AM | Last Updated on Mon, Sep 17 2018 5:56 PM
చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు డీఎంకే,ఏఐఏడీఎంకేలు తప్పులో కాలేశాయి. ఇరు పార్టీల టీవీ అడ్వర్టైజ్ మెంట్లలో ఒకే మహిళ నటించింది. ఏఐఏడీఎంకే పార్టీ వీడియోలో నటించిన ఆమె జయలలిత చేపట్టిన 'అమ్మ క్యాంటీన్' పథకం వల్ల తమ కుంటుంబం భోజనం చేస్తోందని, అన్నం పెట్టిన అమ్మకు ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొంది. అదే మహిళ డీఎంకే ప్రచార వీడియోలో జయలలిత ఖరీదైన విమాన ప్రయాణాలపై విమర్శలు చేసింది. ప్రజల గురించి జయలలితకు ఏమాత్రం పట్టింపు లేదని ఆరోపించింది.
ఇరు పార్టీల అడ్వర్టైజ్ మెంట్లలో నటించిన కస్తూరి పాటి(67) తనకు ఇరు పార్టీలు చేరో వెయ్యి రూపాయలు ఇచ్చాయని పేర్కొంది. ముందు ఏఐడీఎంకే ఒకషార్ట్ ఫిల్మ్ అని చెబితే నటించానని చెప్పింది. డీఎంకే వాళ్లు నటించమని కోరడంతో వారికి తను ఇది వరకే 'అమ్మ క్యాంటీన్' లో నటించానని చెప్పినా వారు వినిపించుకోలేదని ఆమె తెలిపింది. అది కేవలం ప్రకటన మాత్రమేనని దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఇరు పార్టీలు చెబుతున్నాయి. పార్టీల ప్రకటనలు చూసిన జనాలు నవ్వుకుంటున్నారు.
Advertisement
Advertisement