మాజీ ఆర్థీక మంత్రి చిదంబరం శనివారం ఓ సాహిత్య కార్యక్రమంలో మాట్లాడుతూ.. సెటానిక్ వర్సెస్ పుస్తకాన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వం నిషేధించడం తప్పేనంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. చిదంబరం ప్రకటన నేపథ్యంలో రచయిత సల్మాన్ రష్దీ స్పందించాడు. అయితే ఒక తప్పును సరిదిద్దుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటూ ట్విట్టర్లో ఆయన ప్రశ్నించాడు.
రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో చిదంబరం హోం మంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో సల్మాన్ రష్దీ రచించిన వివాదాస్పద పుస్తకం సెటానిక్ వర్సెస్పై 1988లో నిషేధం విధించారు. ప్రభుత్వం తన తప్పును తెలుసుకోవడానికి 27 సంవత్సరాలు పట్టిందని సల్మాన్ రష్థీ ఆవేదన వ్యక్తం చేశారు. సెటానిక్ వర్సెస్ పుస్తకంలో వివాదాస్పద అంశాలు ఉన్నాయనే కారణంతో అప్పట్లో ఓ ఇరాన్ మత సంస్థ ఆయనకు మరణ శిక్ష విదిస్తూ ఫత్వా జారీ చేసింది. దీంతో రచయిత కొన్నాళ్ల పాటు అఙ్ఞాతంలో గడపాల్సి వచ్చింది.
This admission just took 27 years. How many more before the "mistake" is corrected? https://t.co/qz7t1InXzV
— Salman Rushdie (@SalmanRushdie) November 28, 2015