pulled
-
సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు.. తవ్వి చూసి గుడ్లు తేలేశారు!
బ్రెజిల్‌లోని ఓ కుటుంబం అందరినీ హడలెత్తించే విషయాన్ని వెల్లడించింది. తమ బంధువు అయిన 37 ఏళ్ల రోసంగెలా అల్మెయిడా సజీవంగా సమాధి అయ్యిందని తెలిపారు. ఆమె 11 రోజుల పాటు సమాధిలో ఉన్న శవపేటిక నుండి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. బయటపడేందుకు ఆమె పెద్దపెట్టున అరిచేది. శవపేటికను లోపలి నుంచి కాళ్లతో బలంగా తన్నేది. లోపలి నుంచి వస్తున్న శబ్ధాలకు భయపడి ఆ దరిదాపులకు ఎవరూ వెళ్లలేదు. చివరకు ఆ మహిళను సమాధి నుంచి బయటకు తీయగా, చనిపోయి ఎంతో కాలం గడవలేదని తేలింది. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం రోసంగెలా అల్మెయిడా సెప్టిక్ షాక్ గుండెపోటుతో మరణించింది. ఆమె మరణ ధృవీకరణ పత్రంలో కూడా ఇదే ఉంది. రోసంగెలా అల్మెయిడాను సమాధిలో ఉంచిన తర్వాత దానికి ప్లాస్టరింగ్ చేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఆమె 11 రోజుల పాటు శవపేటికలోంచి బయటకు రావడానికి ఎంతో కష్టపడింది. అల్మేడా ఖననం అయిన సమాధి నుండి వింత శబ్ధాలు వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. స్మశానవాటికకు వచ్చేవారు సమాధి నుండి ఎవరివో మూలుగులు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు శ్మశానవాటికకు చేరుకుని సమాధిని తవ్వారు. రోసంగెలా అల్మెయిడాను సమాధి నుండి బయటకు తీసినప్పుడు, శవపేటికలో రక్తం కనిపించింది. ఆమె మణికట్టు, నుదిటిపై గాయాల గుర్తులు ఉన్నాయి. ఖననం చేసే సమయంలో ఎలాంటి గాయాలు లేవని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అల్మేడా శరీరం వెచ్చగా ఉండని డిగ్గర్లు తెలిపారు. దీంతో ఆమె చనిపోయి ఎక్కువ కాలం గడచివుండకపోవచ్చని కుటుంబ సభ్యులు భావించారు. ఆమె సమాధి నుంచి బయటపడేందుకు పెనుగులాడి, చివరకు మృతి చెందివుంటుందని కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సమాధిని తవ్విన వ్యక్తులను కూడా ప్రశ్నించారు. బ్రెజిల్ చట్టం ప్రకారం సజీవంగా ఉన్నవారిని సమాధి చేస్తే మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తారు. రోసాంగిల్ స్పృహతప్పి పడిపోయినట్లు విచారణలో తేలింది. ఆసమయంలో ఆమె చనిపోయినట్లు పొరపడి ఖననం చేశారు. ఇది కూడా చదవండి: అప్పడం ఘన చరిత్ర: పాక్‌లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి.. -
టోల్ గేట్ ఉద్యోగినిపై దాడి.. జుట్టు పట్టి లాగి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. టోల్ పేమెంట్ చేయాలని అడిగినందుకు టోల్ ఫ్లాజా ఉద్యోగినిపై ఓ మహిళ దాడి చేసింది. జుట్టు పట్టుకుని కింద పడేసింది. ఈ ఘటన జాతీయ రహదారి 91పై జరిగింది. సీసీటీవీ ఆధారంగా రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. టోల్ గేట్ వద్ద ఓ కారు వచ్చి ఆగింది. టోల్ ఫ్లాజా సమీప గ్రామస్థులమని చెబుతూ.. పంపించవలసిందిగా కోరారు. ఆ గ్రామస్థులేనడానికి ఏదైనా ఆధారం చూపించమని టోల్ ఫ్లాజా ఉద్యోగిని వారికి అడిగింది. దీంతో కారులో నుంచి బయటకు దిగిన మహిళ.. సదరు ఉద్యోగినితో వాగ్వాదానికి దిగింది. అనంతరం క్యాబిన్లోకి వచ్చి ఉద్యోగిని జుట్టు పట్టుకుని దాడి చేసింది. బాధితురాలిని బూతులు తిడుతూ కింద పడేసింది. సహచర ఉద్యోగులు చొరవ తీసుకుని ఆ మహిళను నిలువరించే ప్రయత్నం చేశారు. Woman's Brazenness Caught On Camera: Toll Plaza Employee Threatened, Hair Pulled https://t.co/hGIn4pSlSO pic.twitter.com/hMjzuID9bX — NDTV (@ndtv) July 17, 2023 ఈ ఘటనపై టోల్ ఫ్లాజా యాజమాన్యం సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ టోల్ ఫ్లాజాకు సమీప గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఐడీ కార్డు అడిగిన నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం ప్రారంభమైనట్లు తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: వామ్మో.. ఈ మ్యాగీ కంటే బిర్యానీ బెటర్.. ధర చూసి షాకైన యూట్యూబర్! -
బాబోయ్..! నదీ ప్రవాహంలో ట్రక్కు డ్రైవింగ్.. వీడియో వైరల్..
-
బాబోయ్..! నదీ ప్రవాహంలో ట్రక్కు డ్రైవింగ్.. వీడియో వైరల్..
పట్నా: బిహార్‌లోని సోన్ నదిలో చిక్కుకున్న లారీలను బయటకు తీస్తున్నారు అధికారులు. ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ఆ దృశ్యాలు బీతికొల్పుతున్నాయి. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సగం లారీ మునిగిపోయినప్పటికీ ప్రవాహంలో వాహనాలను బయటికి తీయడం సాహసంతో కూడిన పని అని నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే.. సోన్ నదీ ప్రవాహంలో ఇప్పటికే ఇద్దరు మరణించారు. ఇటీవల కురిసిన విపరీత వర్షాల కారణంగా సోన్ నదిలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటికే నదిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్న 28 లారీలు నదిలో చిక్కుకుపోయాయి. అదీగాక జులై 1 నుంచి సోన్ నదిలో ఇసుక తవ్వకాలు ఆపేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత వారం రోజుల నుంచి వాహనాలను బయటికి తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే.. రోహ్టాస్ జిల్లాలో ఖటూర్ బాలు ఘాట్ వద్ద లారీలను నదిలో వరద నీరు ఉద్దృతంగా ప్రవహిస్తున్నప్పటికీ బయటకు తీశారు. వాహనం సగంపైనే మునిగిపోయినప్పటికీ ఏమాత్రం వెనకకు తగ్గకుండా ప్రవాహాన్ని దాటేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: కేరళలో మరో అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే..! -
స్కూటర్ని ఇలా కూడా వాడేయొచ్చా!: మహీంద్రా మెచ్చిన ఆవిష్కరణ
మనసు పెడితే దేన్నైనా మనకు సహాయకారిగా ఉపయోగించవచ్చు. కొంచెం కామెన్సెన్స్ ఉంటే దానికి కాస్త తెలివి తోడైతే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. అందుకు ఉదాహరణ ఇక్కడొక వ్యక్తి నిర్మాణ పనులకు స్కూటర్ని ఉపయోగిస్తున్న విధానమే నిదర్శనం. ఇలా కూడా స్కూటర్ని వాడేయొచ్చా అని ఆశ్చర్యం కలిగించేలా ఉపయోగించాడు. వివరాల్లోకెళ్తే...ఇది వరకు 90లలో ఉపయోగించే స్కూటర్ని సిమ్మెంట్ బస్తాలను చేరవేసే సాధనంగా ఉపయోగించాడు ఒక వ్యక్తి . స్కూటర్ మోటారుకి తాడు చివర భాగాన్ని ఇంజన్‌కి జోడించడంతో..దాని సాయంతో సిమ్మెంట్ బస్తాలను నిర్మాణంలో ఉన్న భవనంపైకి తరలిస్తున్నారు. స్కూటర్ హ్యాండిల్‌ని రైజ్ చేయగానే బస్తా పైకెళ్లుతుంది. ఎంచక్కా మనుషుల సంఖ్య, ఖర్చు తగ్గుతుంది కూడా. పని కూడా ఎంతో సులభంగా అయిపోతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంతేగాదు ఈ సరికొత్త ఆవిష్కరణను ఆనంద్ మహీంద్ర మెచ్చుకుంటూ ట్విట్టర్లో... వీటిని పవర్ రైళ్లు అని పిలుస్తాం. ఇంజన్ల శక్తిని ఉపయోగించడానికి అనేక మార్గాలు. ఈ స్కూటర్ మెరుగ్గా ఉంటుంది. నిశబ్దంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఇవి సెక్హ్యాండ్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు మహీంద్ర. 👏🏽👏🏽👏🏽 I guess that’s why we call them ‘power’trains. Many ways to utilise the power of vehicle engines. This would be even better ( and quieter!) with an e-scooter, once their cost is brought down or they are available second-hand. pic.twitter.com/Xo6WuIKEMV — anand mahindra (@anandmahindra) December 6, 2022 (చదవండి: ఒక వ్యక్తినే పెళ్లాడిన ట్విన్ సిస్టర్స్: వీడియో వైరల్) -
చాలెంజ్‌కు పోతే జుట్టూడిపోయింది!
బీజింగ్: సోషల్ మీడియాలో పాపులర్ అయిన వీడియోను అనుకరించబోయిన చైనా మహిళకు చేదు అనుభవం ఎదురైంది. పవర్ డ్రిల్ మెషిన్ సహాయంతో మొక్కజోన్న కంకిని వేగంగా తినడానికి ప్రయత్నించి జుట్టును పోగొట్టుకుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను ఆన్లైన్లో ఎక్కువమంది వీక్షిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల చైనా సోషల్ మీడియాలో 'కార్న్ డ్రిల్ చాలెంజ్' పేరుతో ఓ వీడియో బాగా పాపులర్ అయింది. డ్రిల్ మిషన్‌కు మొక్కజోన్న కంకిని జోడించి అది వేగంగా తిరుగుతున్న సమయంలో కేవలం 10 సెకన్లలో ఆ కంకిని తినేయడం ఆ వీడియోలో కనిపించింది. ఐస్ బకెట్ చాలెంజ్, నాజుకు నడుము అని తెలిపేందుకు ఏ4 పేపర్ చాలెంజ్ లాగే దీనిని కూడా యువత వెర్రిగా అనుకరిస్తున్నారక్కడ. దీనిలో భాగంగా ఓ గుర్తుతెలియని మహిళ అనుకరించే సమయంలో ప్రమాదవశాత్తు డ్రిల్ మిషన్‌లో జుట్టు ఇరుక్కుపోయింది. క్షణకాలంలో జరిగిన ఈ ఘటనలో మహిళ తల ముందుభాగంలోని జుట్టు ఊడిపోయింది. దీంతో బట్టతల మాదిరిగా కనిపిస్తున్న ఆ మహిళకు డాక్టర్లు చికిత్స అందించారు. త్వరలోనే మళ్లీ జుట్టు వస్తుందని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇలాంటి ప్రమాదకర చాలెంజ్‌లు అనుకరించొద్దని కొందరంటుంటే.. అది పూర్తిగా ఆ మహిళ తప్పిదమే అని కొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా చాలెంజ్‌తో ఇంత పాపులర్ అయ్యేదో కాదో తెలియదు కానీ.. ప్రమాదంతో మాత్రం సదరు మహిళ ఫుల్ పాపులర్ అయింది అంటున్నారు ఇంకొందరు. -
’వృద్ధురాలిని లాక్కెల్లిన టీడీపీ ఎమ్మెల్యే’