కాలం మారిపోయింది. ఇప్పుడు పెళ్లయిన కొద్ది రోజులకే కొత్త జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. అలాగే చాలామంది విడాకులు ఎన్ని రోజులలో తీసుకోవచ్చనే విషయాన్ని తరచూ గూగుల్‌లో వెదుకుతున్నారు. దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
జీవితంలో పెళ్లి అనేది మరపురాని అనుభవం అని చెబుతుంటారు. దీనిని తీయనైన గుర్తుగానూ అభివర్ణిస్తుంటారు. అయితే ఇప్పుడు దీనికి భిన్నమైన తీరు చాలాచోట్ల కనిపిస్తోంది. గతంలో పెళ్లయ్యాక తన భాగస్వామితో జీవితాంతం గడపాలని భావించేవారు. అయితే దీనికి భిన్నంగా ఇటీవలి కాలంలో పలువురు భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు చెలరేగుతున్నాయి. ఇవి విడాకుల వరకూ దారితీస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కోర్టు మెట్లు ఎక్కుతున్న కొత్త జంటల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.
భార్యాభర్తల మధ్య సఖ్యత లేనప్పుడు వారు విడాకులు తీసుకోవచ్చు. ఇందుకు కోర్టులో విడాకుల ప్రక్రియ అనేది ఉంటుంది. భార్యాభర్తలు తాము ఇక కలసి ఉండలేమని నిర్ణయించుకున్నప్పుడు న్యాయ వ్యవస్థను ఆశ్రయించి వారు ఒకరికి ఒకరు విడిపోవచ్చు. అయితే భార్యాభర్తలు తమ మధ్య వచ్చే వివాదాల కారణంగా మాత్రమే విడిపోవనవసరం లేదు. అభిప్రాయాలు, అభిరుచులు కలవనప్పుడు పరస్పర సమ్మతితో భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకోవచ్చు.
చట్ట ప్రకారం భార్యాభర్తలు విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పెళ్లయిన నెల రోజుల వ్యవధిలోనే కొత్త జంట విడాకులు తీసుకోవాలంటే వారు ఏం చేయాలనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ఇటువంటి పరిస్థితులలో కొత్తజంట విడాకుల కోసం కనీసం ఏడాది కాలం వెయిట్ చేయాల్సి వస్తుందని చాలా మంది చెబుతుంటారు. అయితే కోత్తజంట తమ మధ్య సయోధ్య కుదరనప్పుడు పెళ్లయిన వారం రోజుల తరువాత కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చట్టం చెబుతోంది. అయితే కోర్టు వారికి విడాకులు మంజూరు చేసేందుకు 6 మాసాల గడువు ఇస్తుంది. ఈలోపు వారు కలసివుండాలని నిర్ణయించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని కోర్టు భావిస్తుంది.
హిందూ వివాహ చట్టం 1955 ఏమి చెబుతున్నదంటే..
విడాకులు, న్యాయపరంగా విడిపోవడం అనేవి రెండూ హిందూ వివాహ చట్టం 1955 కిందకు వస్తాయి. వేర్వేరు సెక్షన్లలో రెండింటికి సంబంధించి నిబంధనలను రూపొందించారు. సెక్షన్ 13లో విడాకుల గురించి తెలియజేయగా, సెక్షన్ 10లో న్యాయపరంగా విడిపోవడానికి సంబంధించిన నిబంధనలు కనిపిస్తాయి. పెళ్లయిన జంటలు న్యాయపరంగా విడిపోవాలనుకున్నప్పుడు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. అప్పుడువారు విడివిడిగా జీవించడానికి కోర్టు అనుమతినిస్తుంది. ఈలోపు ఆ జంట తమ వైవాహిక జీవితం గురించి మరోసారి ఆలోచించి, మంచి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: చికిత్సకు వచ్చిన బాధితునితో నర్సు రిలేషన్..ఆమెకు ఊహించని షాక్!
Comments
Please login to add a commentAdd a comment