minimum
-
కొత్త జంట ఎన్ని రోజులకు విడాకులు తీసుకోవచ్చు?.. కొద్దిమందికే తెలిసిన సంగతిది!
కాలం మారిపోయింది. ఇప్పుడు పెళ్లయిన కొద్ది రోజులకే కొత్త జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. అలాగే చాలామంది విడాకులు ఎన్ని రోజులలో తీసుకోవచ్చనే విషయాన్ని తరచూ గూగుల్‌లో వెదుకుతున్నారు. దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో పెళ్లి అనేది మరపురాని అనుభవం అని చెబుతుంటారు. దీనిని తీయనైన గుర్తుగానూ అభివర్ణిస్తుంటారు. అయితే ఇప్పుడు దీనికి భిన్నమైన తీరు చాలాచోట్ల కనిపిస్తోంది. గతంలో పెళ్లయ్యాక తన భాగస్వామితో జీవితాంతం గడపాలని భావించేవారు. అయితే దీనికి భిన్నంగా ఇటీవలి కాలంలో పలువురు భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు చెలరేగుతున్నాయి. ఇవి విడాకుల వరకూ దారితీస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కోర్టు మెట్లు ఎక్కుతున్న కొత్త జంటల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లేనప్పుడు వారు విడాకులు తీసుకోవచ్చు. ఇందుకు కోర్టులో విడాకుల ప్రక్రియ అనేది ఉంటుంది. భార్యాభర్తలు తాము ఇక కలసి ఉండలేమని నిర్ణయించుకున్నప్పుడు న్యాయ వ్యవస్థను ఆశ్రయించి వారు ఒకరికి ఒకరు విడిపోవచ్చు. అయితే భార్యాభర్తలు తమ మధ్య వచ్చే వివాదాల కారణంగా మాత్రమే విడిపోవనవసరం లేదు. అభిప్రాయాలు, అభిరుచులు కలవనప్పుడు పరస్పర సమ్మతితో భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకోవచ్చు. చట్ట ప్రకారం భార్యాభర్తలు విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పెళ్లయిన నెల రోజుల వ్యవధిలోనే కొత్త జంట విడాకులు తీసుకోవాలంటే వారు ఏం చేయాలనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ఇటువంటి పరిస్థితులలో కొత్తజంట విడాకుల కోసం కనీసం ఏడాది కాలం వెయిట్ చేయాల్సి వస్తుందని చాలా మంది చెబుతుంటారు. అయితే కోత్తజంట తమ మధ్య సయోధ్య కుదరనప్పుడు పెళ్లయిన వారం రోజుల తరువాత కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చట్టం చెబుతోంది. అయితే కోర్టు వారికి విడాకులు మంజూరు చేసేందుకు 6 మాసాల గడువు ఇస్తుంది. ఈలోపు వారు కలసివుండాలని నిర్ణయించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని కోర్టు భావిస్తుంది. హిందూ వివాహ చట్టం 1955 ఏమి చెబుతున్నదంటే.. విడాకులు, న్యాయపరంగా విడిపోవడం అనేవి రెండూ హిందూ వివాహ చట్టం 1955 కిందకు వస్తాయి. వేర్వేరు సెక్షన్లలో రెండింటికి సంబంధించి నిబంధనలను రూపొందించారు. సెక్షన్ 13లో విడాకుల గురించి తెలియజేయగా, సెక్షన్ 10లో న్యాయపరంగా విడిపోవడానికి సంబంధించిన నిబంధనలు కనిపిస్తాయి. పెళ్లయిన జంటలు న్యాయపరంగా విడిపోవాలనుకున్నప్పుడు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. అప్పుడువారు విడివిడిగా జీవించడానికి కోర్టు అనుమతినిస్తుంది. ఈలోపు ఆ జంట తమ వైవాహిక జీవితం గురించి మరోసారి ఆలోచించి, మంచి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది కూడా చదవండి: చికిత్సకు వచ్చిన బాధితునితో నర్సు రిలేషన్..ఆమెకు ఊహించని షాక్! -
మినిమమ్ బ్యాలన్స్ తప్పుడు వార్తల పై క్లారిటీ..!
-
పరిశ్రమలకు ఊరట.. ఏపీఈఆర్సీ కీలక ఆదేశాలు..
సాక్షి, అమరావతి: పరిశ్రమల నిర్వాహకులకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఊరట కలిగించింది. రాష్ట్రంలో నిర్వహణ భారమై మూతపడ్డ పరిశ్రమలకు విద్యుత్ సర్వీసును తిరిగి ఇచ్చేందుకు కనిష్ట చార్జీలను వసూలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను ఏపీఈఆర్సీ ఆదేశించింది. ఈ నిబంధన వచ్చే మార్చి 31 వరకు అమలులో ఉంటుందంది. ఖాయిలా పడ్డ పరిశ్రమలకు విద్యుత్ పునరుద్ధరణ విధానం అమలుపై మూడు నెలలకోసారి సమాచారం ఇవ్వాలని నిర్దేశించింది. చదవండి: AP: ‘అంగన్వాడీ’ల ఆధునికీకరణ ఓ పరిశ్రమ విద్యుత్ బిల్లులు చెల్లించకుండా కొంతకాలం నడిచి, మూతపడితే మూడు నెలల పాటు కనీస చార్జీల రూపంలో బిల్లు జారీ అవుతుంది. తరువాత ఆ బిల్లూ నిలిపేస్తారు. కొన్నేళ్ల తరువాత పరిస్థితులు చక్కబడి పరిశ్రమను తిరిగి తెరవాలనుకున్నప్పుడు విద్యుత్ సర్వీసును పునరుద్ధరించాల్సి ఉంటుంది. అప్పుడు మూతపడ్డ రోజులన్నిటికీ కనీస చార్జీలు వసూలు చేయాల్సి ఉన్నా అలా చేయరు. తొలి మూడునెలలకు మాత్రమే కట్టించుకుని మళ్లీ సర్వీసును ఇచ్చేస్తారు. అయితే పరిశ్రమ మూతపడే సమయానికి ఉన్న విద్యుత్ బిల్లు బకాయిలను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. కోవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న పరిశ్రమలు వైరస్ ప్రభావం తగ్గడంతో మళ్లీ తెరుచుకుంటున్నాయి. అటువంటి పరిశ్రమలకు ఏపీఈఆర్సీ ద్వారా డిస్కంలు అందిస్తున్న ఈ వెసులుబాటు ప్రయోజనం కలిగించనుంది. -
కాంగ్రెస్‌లో జోష్
సాక్షి, శంషాబాద్: కనీస ఆదాయ వాగ్దాన సభ విజయవంతం కావడంతో జిల్లా కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. సభను సక్సెస్ చేయడానికి కాంగ్రెస్ నేతలు మూడు రోజులుగా శంషాబాద్ క్లాసిక్ త్రీ కన్వెన్షన్‌లో ఏర్పాట్లు చేశారు. చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులను తరలించారు. తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, ఎల్బీనగర్, మహేశ్వరం నుంచి కార్యకర్తలు మధ్యాహ్నం 3 గంటల నుంచే వేదిక వద్దకు చేరుకున్నారు. శంషాబాద్ పట్టణంలో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున హోర్డింగ్‌లు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. సభావేదికపై రాహుల్ ప్రసంగానికి పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన కనిపించింది. కార్యకర్తలు శ్రద్ధగా వింటూ పెద్దఎత్తున కరతాళ ధ్వనులు చేశారు. కనీస ఆదాయం పథకాన్ని ప్రతి ఒక్కరికి వర్తింపజేస్తామన్న ఆయన హామీపై పెద్దఎత్తున హర్షం వ్యక్తం చేశారు. వీఐపీలకు తిప్పలు వేదికకు ఎదురుగా ఉన్న స్థలంలో వీఐపీలకు కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. వీఐపీ పాస్ ఉన్న వారు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించినా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పాస్‌లు ఉన్నా వీఐపీ గ్యాలరీకి అనుమతించకపోవడంతో పలువురు పార్టీ నాయకులు వారి నేతల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. దీంతో వీఐపీ పాస్‌లు ఉన్నవారిని అనుమతించాలంటూ మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్దేశ్వర్ మైకుల్లో పోలీసులకు పదేపదే సూచించారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద సభ సక్సెస్ కావడంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. వారిలో కొత్త ఉత్సాహం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేననే ధీమాతో కనిపించారు. -
ఫ్రీ డేటా, వాయిస్ ఆఫర్లకు ఇక రాం రాం?
న్యూఢిల్లీ: టెలికాం సెక్టార్లో ఎదురవుతున్న ఆర్థిక ఒత్తడి, నష్టాల నేపథ్యంలో దేశీయ టెలికాం కంపెనీలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఒకవైపు జియో చెక్ చెప్పడంతోపాటు, కష్టాల గట్టెక్కేందుకు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కనీస ధరలను ఫిక్స్ చేయాల్సిందిగా టెలికం ఆపరేటర్లు మార్కెట్ రెగ్యులేటరీని ఆశ్రయించాయి. డేటా ,వాయిస్ కాల్స్ రెండింటికీ కనీస ఫ్లోర్ ధరను నిర్ణయించాలని కోరతూ కొన్ని టెలికాం ఆపరేటర్లు భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ను ఆశ్రయించాయి. దీంతో ట్రాయ్ జూలై 21 న 'కనీస ఫ్లోర్ ధర' అంశంపై అన్ని సర్వీసు ప్రొవైడర్ల అభిప్రాయాలు, వాదనలు కోరనుంది. దీంతో ఉచితడేటా, వాయిస్ సేవలకు త్వరలోనే ముగింపు పడనుందా అనే ఊహాగానాలు పరిశ్రమ వర్గాల్లో నెలకొన్నాయి. పరిశ్రమ ఆర్థిక నష్టాలను, పెరుగుతున్న ఆర్ధిక ఒత్తిడిని నొక్కి చెప్పిన ఐడియా గత నెలలో రెగ్యులేటర్ ఇండస్ట్రీ పరిశ్రమలు, అంతర్ మంత్రిత్వ గ్రూపు (ఐఎంజీ) భేటీ సందర్భంగా ఫ్లోర్ ధర నిర్ణయం డిమాండ్‌ను ప్రస్తావించింది. కాగా టెలికాం సెక్టార్ లోకి రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన మొత్తం ఆర్థిక పరిస్థితినే మార్చి వేసింది. ఉచిత డేటా, వాయిస్ కాల్స్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చని ఇతర దిగ్గజ కంపెనీలను పలు ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వాటి లాభాలను, ఆదాయాలను భారీగా ప్రభావితం చేసింది. అంతేకాదు ఆయా కంపెనీల మొత్తం టారిఫ్ ప్లాన్లలో పెను మార్పులకు నాంది పలికింది. ప్రధానంగా టెలికాం మేజర్‌ను భారతీఎయిర్‌టెల్‌ను బాగా దెబ్బ కొట్టింది. ఐడియా, వోడాఫోన్, ఆర్‌కామ్ ఇదే వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. -
కనీస పింఛను రూ.10వేలు ఇవ్వాలి
ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ మహాసభ డిమాండ్ కాకినాడ సిటీ : కనీస పింఛను రూ.10వేలు ఇవ్వాలని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గురువారం స్థ్ధానిక కొండయ్యపాలెంలోని జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స అసోసియేషన్ జిల్లా ప్రథమ మహాసభ హార్లిక్స్ పెన్షనర్స్ సంఘ నాయకులు సీహెచ్.మోహనరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మహాసభలో వివిధ అంశాలు, సమస్యలపై చర్చించిన అనంతరం వక్తలు మాట్లాడుతూ జీపీఎస్ విధానం రద్దు చేయాలని, సమస్యలపై పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెన్షనర్ల సంఘాలు ఐక్యంగా పోరాటాలకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. పీఎఫ్ఆర్yీ ఏ బిల్లు రద్దు చేయాలని, హెల్త్ కార్డులు ఇచ్చి వాటిపై అన్ని ఆస్పత్రుల్లో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ జిల్లా కన్వీనర్ సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జేవీవీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.స్టాలిన్, అధ్యక్షుడు కేఎంఎంఆర్ ప్రసాద్, జిల్లా ఉద్యోగ జేఏసీ అధ్యక్షులు బూరిగ ఆశీర్వాదం, ఎన్జీవో సంఘ మాజీ అధ్యక్షులు ఆచంట రామారాయుడు, వివిధ పెన్షనర్ల సంఘాల నాయకులు వీవీ కృష్ణమాచార్యులు, పీఎస్ఎస్ఎన్పీ శాస్త్రి, జి.అప్పారావు, ఏవీయూ సుబ్బారావు, బి.సత్యనారాయణ, సదానందమూర్తి పాల్గొన్నారు. -
వయసు నిబంధన.. ప్రమాదాన్ని తగ్గిస్తుంది!
హూస్టన్‌ః అనేక దేశాల్లో వివాహాలకు చట్టపరమైన వయసు నిబంధనలు ఉన్నసంగతి తెలిసిందే. కానీ అలవాట్లకు సైతం నిబంధనలు విధిస్తే ఆరోగ్యాలు బాగుపడతాయంటున్నారు తాజా పరిశోధకులు. చిన్ననాటినుంచే చెడు అలవాట్లకు బానిసలౌతుండటంతో, అతి తక్కువ వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేపట్టింది. మద్యపానానికి చట్టపరంగా 21 ఏళ్ళ వయసును నిర్థారిస్తే.. చిన్నవయసునుంచే మద్యం తాగే అలవాటు ఉన్నవారితో పోలిస్తే మరణాల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. మద్యం తాగేందుకు కనీస వయసు (మినిమమ్ లీగల్ డ్రింకింగ్ ఏజ్ (ఎంఎల్డీయే) 21 ఏళ్ళు ఉండేట్టుగా చట్టాన్ని తెస్తే మరణాల శాతం తగ్గుతుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. మద్యం తాగే వయసు కనీసం 21 ఏళ్ళు ఉండేట్లుగా చూస్తే.. యవ్వనంలో ఆరోగ్య పరంగా అనేక లాభాలు చేకూరుతాయని అధ్యయనకారులు చెప్తున్నారు. 21 ఏళ్ళ వయసుకన్నా ముందే మద్యానికి అలవాటు పడినవారు... మద్యానికి సంబంధించిన అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటమే కాక, మరణించే ప్రమాదం కూడ ఉన్నట్లు పరిశోధనల్లో తెలుసుకున్నారు. 1990 నుంచి 2010 మధ్య జనాభా మరియు, వారి మరణాలకు కారణాల డేటాను అమెరికా రీసెర్స్ సొసైటీనుంచి సేకరించిన శాస్త్రవేత్తలు.. 21 ఏళ్ళ వయసులోపు మద్యపానం అలవాటు అనేక ప్రమాదాలకు దారి తీస్తుందని తెలుసుకున్నారు. మద్యపానం అలవాటుతో కాలేయానికి సంబంధించిన వ్యాధుల బారిన పడినవారు, మద్యపానం వల్ల క్యాన్సర్ తో చనిపోయినవారి రికార్డులను సైతం అధ్యయనకారులు పరిశీలించారు. దీనిద్వారా మద్యపానం సేవించే కనీస వయసు 21 ఏళ్ళు ఉండాలనే చట్టపరమైన నిబంధన విధిస్తే... అనేక ఆల్కహాలిక్ వ్యాధులవల్ల ఏర్పడే మరణాల సంఖ్య తగ్గించి, జీవించే సమయాన్ని పెంచవచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. ముఖ్యంగా కాలేజీలకు వెళ్ళనివారికి ఈ నిబంధన వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని అధ్యయనకారులు చెప్తున్నారు. అలాగే విద్యాలయ ప్రాంగణాల్లో 21 ఏళ్ళ వయసు లోపు ఉన్నవారిపై మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే ఎంఎల్డీయే వల్ల కళాశాలలకు హాజరయ్యే విద్యార్థులకు సైతం లాభం చేకూరుతుందని భావిస్తున్న అధ్యయనకారులు తమ క్లినికల్ అండ్ ఎక్స్ పరిమెంటల్ పరిశోధనలను ఆల్కహాలిజం జర్నల్ లో నివేదించారు.