రాబోయే లోక్‌సభ ఎన్నికలు పచ్చని సంసారాల్లో చిచ్చులు కూడా పెడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలహాలకు కారణమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితి మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో చోటుచేసుకుంది.
బాలాఘాట్ లోక్‌సభ స్థానానికి జరగబోయే ఎన్నికలు భార్యాభర్తల మధ్య వివాదాలకు కారణంగా నిలిచాయి. ‘ఎన్నికల ప్రచారం అయ్యే వరకు నేను ఒక్కడినే ఇంట్లో ఉంటాను.. లేదంటే నువ్వు ఒక్కర్తివే ఇంట్లో ఉండు. ఇద్దరం ఒకే చోట ఉండటం కుదరదు’ అంటూ బీఎస్‌పీ నేత, మాజీ ఎంపీ కంకర్ ముంజరే తన భార్య, కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే అనుభా ముంజరేను కోరారు. దీంతో అనుభా ముంజరే దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు.
మాజీ ఎంపీ కంకర్ ముంజరే బీఎస్పీ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. అతని భార్య అనుభా ముంజరే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సామ్రాట్ సరస్వర్ కోసం ప్రచారం సాగిస్తున్నారు. అనుభ ముంజరే, కంకర్ ముంజరేలు భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో ఉంటూ వేర్వేరు పార్టీలకు ప్రచారం చేయడం వారికి సమస్యగా మారింది. మరోవైపు అనుభ ముంజరే బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న తన భర్త కంకర్ ముంజరేకు ప్రచారం చేస్తారా లేక కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తారా? అంటూ పలువురు మరో సమస్యను లేవదీస్తున్నారు.
ఈ నేపధ్యంలో భర్త కంకర్ ముంజరే తన భార్యతో ‘ఏప్రిల్ 19వ తేదీన ఇక్కడ లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ ముగిసే వరకు ఇంటికి దూరంగా ఉండు. మీ సోదరి ఇంటికి లేదా వేరే ఎక్కిడికైనా వెళ్లి కాంగ్రెస్ తరపున ప్రచారం సాగించు. ఈ ఇంటిలో ఉంటూ కాంగ్రెస్‌కు ప్రచారం చేయవద్దు. నువ్వు ఇల్లు వదిలి వెళ్లకపోతే నేను ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి ఎన్నికలకు ప్రచారం చేసుకుంటాను. ఈ విషయంలో నువ్వు ఎలాంటి ప్రశ్నలు వేయవద్దు. ఇది మా పార్టీ విధివిధానాలకు సంబంధించిన విషయం. నేను ఇందులో ఏ మాత్రం రాజీపడను’ అని భార్యతో తెగేసి చెప్పేశాడట.
Comments
Please login to add a commentAdd a comment