టీచర్లు, విద్యార్థులకు డిజిటల్‌ శిక్షణ అవసరం | Teachers and students need digital training | Sakshi
Sakshi News home page

టీచర్లు, విద్యార్థులకు డిజిటల్‌ శిక్షణ అవసరం

Published Fri, Sep 22 2023 4:09 AM | Last Updated on Fri, Sep 22 2023 11:50 AM

Teachers and students need digital training - Sakshi

సాక్షి, అమరావతి: డిజిటల్‌ పరికరాల వాడకంతో విద్యా­ర్థుల సమయం దుర్వి­­నియోగం కావడమే కాకుండా వ్యసనంలా మారే అవకాశం ఉందని పాఠ­శాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్ కుమార్‌ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), వలంటరీ హెల్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థల ప్రతినిధులతో గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో కమిషనర్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సాంకేతిక యుగంలో డిజిటల్‌ వాడకానికి ప్రాధాన్యం పెరిగిందని, వాటిని సరైన రీతిలో వినియోగిస్తే ఎలాంటి హాని ఉండదని అన్నారు. సోషల్‌ మీడియా అతి వాడకం, తప్పుడు వార్తల ప్రభావం సైబర్‌ నేరా­లకు పురిగొల్పుతాయని, స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్‌ వంటి డిజిటల్‌ పరికరాలు, సోషల్‌ మీడియా వాడకం ప్రయోజనాలు, దు్రష్పయోజనాలపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వా­లని సూచించారు.

ఈ సందర్భంగా ఆయా అంశాలపై రూపొందించిన మాడ్యూళ్లు, పోస్టర్లను కమిషనర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాఠశాల విద్య డైరెక్టర్‌ పి.పార్వతి, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు డాక్టర్‌ ట్రాన్‌ మిన్‌హు ఎన్‌జెన్, సోఫియా భావన బి.ముఖోపాధ్యాయ్‌ డాక్టర్‌ నాన్సీ ప్రీత్‌ కౌర్, జేవీ మోహన్‌రావు, షేక్‌ ఇస్మాయిల్, ఆర్‌.మన్మోహన్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement