
బనశంకరి: ప్రజల్లో డిజిటల్ ఆర్థిక సాధికారత కోసం బెంగుళూరుకు చెందిన ఒక పోస్టుమాస్టర్ చేస్తున్న కృషికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ముగ్ధుల య్యారు. పోస్ట్‌మాస్టర్ కె.కుసుమ కృషి అభినందనీయమని సామాజిక మాధ్యమాల్లో ప్రశంసించారు. ఇటీవల బెంగళూరులో ఎందరో సామాజిక కార్యకర్తలను కలిశారు.
పోస్ట్‌మాస్టర్‌అయిన కుసుమనూ కలిశారు. భారత్‌లో శరవేగంగా సాగుతున్న డిజిటల్ ఆర్థికాభివృద్ధిలో కుసుమ వంటివారు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడిన బిల్‌గేట్స్ ఆమెతో ఉన్న ఫోటోను షేర్ చేశారు.