మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉచితంగా ఐపీఎల్‌-2022 మ్యాచ్‌లను ఇలా చూడండి..! | How to watch IPL 2022 for free Details in Telugu | Sakshi
Sakshi News home page

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉచితంగా ఐపీఎల్‌-2022 మ్యాచ్‌లను ఇలా చూడండి..!

Published Mon, Mar 28 2022 8:32 PM | Last Updated on Mon, Mar 28 2022 8:55 PM

How to watch IPL 2022 for free Details in Telugu - Sakshi

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ టీ20 లీగ్ ఐపీఎల్‌- 15వ ఎడిషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్‌లు 29 మే 2022 వరకు కొనసాగుతాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్‌ లేదా డిస్నీ+హాట్‌స్టార్‌ ద్వారా వీక్షించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ అభిమానుల కోసం పలు దిగ్గజ టెలికాం సంస్థలు జియో, వోడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ సరికొత్త బండిల్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి.  వీటితో ఐపీఎల్‌-2022 మ్యాచ్‌లను ఉచితంగా చూడడమే కాకుండా ఇంటర్నెట్‌ డేటా కూడా లభిస్తోంది. టెలికాం సంస్థలే కాకుండా ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు, ఫిన్‌టెక్‌ సంస్థలు కూడా పలు ఆఫర్లను అందిస్తున్నాయి. 

ఉచితంగా డిస్నీ+హట్‌స్టార్‌ సేవలను జియో అందిస్తోన్నరీఛార్జ్ ప్లాన్స్‌

  • రూ. 499 ప్లాన్: 2GB డేటా/రోజు: అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 28 రోజుల చెల్లుబాటు
  • రూ. 601 ప్లాన్: 3GB డేటా/రోజు + 6GB అదనపు డేటా, అపరిమిత కాల్‌లు, 100 SMS/రోజు, 28 రోజుల చెల్లుబాటు
  • రూ. 659 ప్లాన్: 1.5GB డేటా/రోజు, 56 రోజుల చెల్లుబాటు.
  • రూ. 799 ప్లాన్: 2GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 56 రోజుల చెల్లుబాటు
  • రూ. 1066 ప్లాన్: 2GB డేటా/రోజు + 5GB అదనపు డేటా, అపరిమిత కాల్‌లు, 100 SMS/రోజు, 84 రోజుల చెల్లుబాటు
  • రూ. 3,199 ప్లాన్: 2GB డేటా/రోజు + 10GB అదనపు డేటా, అపరిమిత కాల్‌లు, 100/రోజు, 365 రోజుల చెల్లుబాటు
  • రూ. 1,499 ప్లాన్: రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్‌లు, 100 SMS/రోజు, 84 రోజుల చెల్లుబాటు
  • రూ. 4,199 ప్లాన్: రోజుకు 3GB డేటా, అపరిమిత కాల్‌లు, 100 SMS/రోజు, 365 రోజుల చెల్లుబాటు

ఉచితంగా డిస్నీ+హట్‌స్టార్‌ సేవలను వోడాఫోన్‌ ఐడియా అందిస్తోన్నరీఛార్జ్ ప్లాన్స్‌

  • రూ. 601 ప్లాన్: 3GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 28 రోజుల చెల్లుబాటు
  • రూ. 901 ప్లాన్: 3GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 70 రోజుల చెల్లుబాటు
  • రూ. 3,099 ప్లాన్: 1.5GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 365 రోజుల చెల్లుబాటు

ఉచితంగా డిస్నీ+హట్‌స్టార్‌ సేవలను ఎయిర్‌టెల్‌ అందిస్తోన్నరీఛార్జ్ ప్లాన్స్‌

  • రూ. 838 ప్లాన్: 2GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 56 రోజుల చెల్లుబాటు, ఈ ప్లాన్‌తో అమెజాన్‌ ప్రైం, ఎయిర్‌టెల్‌ వీంక్‌ సేవలను ఉచితంగా పొందవచ్చును. 
  • రూ. 839 ప్లాన్: 2GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 84 రోజుల చెల్లుబాటు
  • రూ. 2,999 ప్లాన్: 2GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 84 రోజుల చెల్లుబాటు

డిస్నీ+హాట్‌స్టార్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సేవలను ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ స్లైస్‌ అందిస్తోంది. ఇది కేవలం స్లైస్‌ స్పార్క్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌పై రూ. 250 వరకు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తోంది. 

 టైమ్స్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లు డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. టైమ్స్ ప్రైమ్ తన కొత్త కస్టమర్లకు డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. టైమ్స్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు  రూ. 1,199 చెల్లించడంతో కస్టమర్‌లు డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్‌కి ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందుతారు.

 హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వినియోగదారులు GyFTR వెబ్‌సైట్‌ని ఉపయోగించి డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సభ్యత్వాన్ని ప్రత్యేక తగ్గింపు రేటుతో కొనుగోలు చేయవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కొనుగోలుపై ఫ్లాట్ 15 శాతం తగ్గింపును అందిస్తోంది.

 ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో తరచుగా ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారైతే, మీ కొనుగోళ్లకు రివార్డ్‌లుగా సూపర్‌కాయిన్స్‌ను అందిస్తోంది. ఈ SuperCoins తో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందడానికి రీడీమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు 299 Flipkart SuperCoinsతో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందుతారు.

చదవండి: అత్యంత సరసమైన ధరలో లగ్జరీ బైక్‌..! ట్రయంఫ్‌ నుంచి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement