5G Auction: Jio Signals 5G Blitz With 14k Crores Auction Deposit, Details Inside - Sakshi
Sakshi News home page

5జీ స్పెక్ట్రం: జియో మరో సునామీకి సిద్ధం

Published Tue, Jul 19 2022 12:26 PM | Last Updated on Wed, Jul 20 2022 11:30 AM

Jio signals 5G blitz with 14k cr  auction deposit - Sakshi

సాక్షి, ముంబై: 5జీ స్పెక్ట్రం  వేలంలో  టెలికాం మేజర్‌  రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ టాప్‌లో  దూసుకొచ్చింది.  త్వరలో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు జియో ఏకంగా 14 వేల కోట్లను డిపాజిట్‌ చేసింది. టెలికం సంస్థలు మొత్తం రూ. 21,800 కోట్లు ఈఎండీగా చెల్లించగా, ఇందులో 14,000 కోట్లతో  జియో టాప్‌లో నిలిచింది.  భారతి ఎయిర్‌టెల్‌ రూ. 5,500 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 2,200 కోట్లు, అదానీ డేటా నెట్‌వర్క్స్‌ రూ. 100 కోట్లు డిపాజిట్‌ చేశాయి.

తోటి బిలియనీర్ అదానీకి భిన్నంగా, అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ₹14,000 కోట్లను డిపాజిట్‌  చేయడం విశేషంగా నిలిచింది.  14,000 కోట్లతో, వేలానికి ఉంచిన మొత్తం స్పెక్ట్రమ్‌లో మూడింట ఒక వంతు, 1.4 ట్రిలియన్ విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయవచ్చు. భారత టెలికాం రంగంలోకి   ప్రత్యర్థులకు ధీటుగా జియో  నిలవనుందని సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ అన్నారు.  
జియో  డిపాజిట్ భారీ స్పెక్ట్రమ్ కొనుగోలు ప్రణాళికను  సూచిస్తుందనీ,  దీనికితోడు ఇప్పటికే 4G ఫ్రీక్వెన్సీల కోసం మునుపటి వేలంలో 57వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది, ఇక 4జీ లేదా ఇతర బ్యాండ్స్‌ ఎయిర్‌వేవ్‌లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని  అంటున్నారు.

మరోవైపు గౌతమ్‌ అదానీ టెలికా రంగంలో ప్రవేశాస్తున్నారన్న ఊహాగానాలు ప్రత్యర్థి టెల్కోలను ఆందోళనకు గురి చేశాయి, ఆరేళ్ల క్రితం ముకేశ్ అంబానీ జియో ఎంట్రీ, సృష్టించిన సునామీని గుర్తు చేసుకుంటున్నారు. అయితే అదానీ పోటీకి దూరంగా ఉన్నారనీ, 3.5 GHz బ్యాండ్‌లో 5G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేస్తారని  భావించడం లేదని పేరు  చెప్పడానికి అంగీకరించని టాప్ ఎగ్జిక్యూటివ్ అన్నారు. 650-700 కోట్ల రూపాయల విలువైన ఎయిర్‌వేవ్‌లను కొనుగోలు చేయనుంది, కానీ ప్రస్తుతానికి, వినియోగదారుల సేవల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. ఇది మూడు ప్రధాన టెల్కోలకు  భారీ ఉపశమనం కానుందని వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement