టాటా కొత్త డీల్‌.. జియోకి గట్టి పోటీ తప్పదా? | Reliance jio to face tough competition as Tata massive deal | Sakshi
Sakshi News home page

టాటా కొత్త డీల్‌.. జియోకి గట్టి పోటీ తప్పదా?

Published Mon, Jul 15 2024 7:37 PM | Last Updated on Mon, Jul 15 2024 8:03 PM

Reliance jio to face tough competition as Tata massive deal

ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచేశాయి. దీని వల్ల చాలా మంది యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL)కి మారారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ధోరణి మరింతగా పెరుగుతోంది. అనేకమంది ఎయిర్‌టెల్‌ (Airtel), జియో (Jio) వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌కి పోర్ట్ చేసుకుంటున్నారు.

ఈ రెండు తమ ప్లాన్‌ ధరలను విపరీతంగా పెంచడంపై సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారులు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), బీఎస్‌ఎన్‌ఎల్‌ మధ్య ఇటీవల రూ.15,000 కోట్ల డీల్ కుదిరింది. ఇందులో భాగంగా టీసీఎస్‌, బీఎస్‌ఎన్ఎల్‌ కలిసి దేశం అంతటా 1,000 గ్రామాలకు 4జీ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. ఇది సమీప భవిష్యత్తులో వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందిస్తుంది.

ప్రస్తుతం 4జీ ఇంటర్నెట్ సర్వీస్ మార్కెట్‌లో జియో, ఎయిర్‌టెల్‌ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటే అది జియో, ఎయిర్‌టెల్‌లకు గణనీయమైన సవాలుగా మారవచ్చు. టాటా దేశం అంతటా నాలుగు ప్రాంతాలలో డేటా సెంటర్‌లను కూడా నిర్మిస్తోంది. ఇది దేశంలో 4జీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడుతుంది.

గత నెలలో జియో తమ రీఛార్జ్ ప్లాన్‌లలో ధరల పెంపును ప్రకటించింది.  ఆ తర్వాత ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కూడా ఇలాంటి ప్రకటనలు చేశాయి.  వీటిలో జియో ధరల పెరుగుదల అత్యధికం. ఇది 12% నుంచి 25% వరకు ఉంది. ఎయిర్‌టెల్ ధరలు 11% నుంచి 21%, వొడాఫోన్‌  ధరలు 10% నుంచి 21% వరకు పెరిగాయి. కాగా సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు జియోపైనే ఉన్నాయి. చాలా మంది జియో యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement