
డేటా వినియోగం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద టెలికామ్ ఆపరేటర్‌గా రిలయన్స్ జియో సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. చైనా కంపెనీలను సైతం జియో వెనక్కు నెట్టి మొదటి స్థానం ఆక్రమించుకుంది.
జియో వెల్లడించిన జూన్ త్రైమాసిక గణాంకాల ప్రకారం.. మొత్తం డేటా వినియోగం ఏకంగా 4400 కోట్ల జీబీ దాటినట్లు తెలిసింది. ఇది గతేడాదికంటే కూడా 33 శాతం ఎక్కువని తెలుస్తోంది. గణాంకాల ప్రకారం యూజర్లు ప్రతిరోజూ 1 జీబీ కంటే కూడా ఎక్కువ డేటాను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
5జీ డేటా ఉపయోగించే కస్టమర్ల సంఖ్య ఏకంగా 13 కోట్లకు చేరింది. అర్హత కలిగిన కస్టమర్లు 4జీ ప్లాన్ రీఛార్జ్ మీద 5జీ డేటాను ఉపయోగించుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే 5జీ డేటా ఉపయోగించేవారు సంఖ్య విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం జియోకు 49 కోట్ల కంటే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.
జియో డేటా ఉపయోగించే మొబైల్ యూజర్ల సంఖ్య మాత్రమే కాకుండా.. ఫిక్స్డ్ వైర్‌లెస్ ఇంటర్నెట్ ఉపయోగించేవారు సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గణాంకాల ప్రకారం 10 లక్షల కంటే ఎక్కువమంది ఎయిర్‌ఫైబర్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment