ఒకప్పుడు మొబైల్ ఇంటర్నెట్ అంటే చాలా ఖరీదైన అంశం. ఒక్కో ఎంబీ డేటాను ఆచితూచి వాడుకునేవాళ్లం. ఇక వాయిస్ కాల్స్ సంగతి సరేసరి. కాలింగ్ సదుపాయాన్ని నిమిషాల లెక్కన కొనుక్కునేవాళ్లం. భారత టెలికాం మార్కెట్‌లో జియో అడుగు పెట్టిన తర్వాత ఈ పరిస్థితులు మారిపోయాయి. నేడు జీబీలకు జీబీలు అలవోకగా వాడేసుకుంటున్నాం. గంటలకొద్దీ వాయిస్ కాల్స్ అపరిమితంగా మాట్లాడేసుకుంటున్నాం..
దేశ టెలికం మార్కెట్‌లోకి రిలయన్స్ జియో ప్రవేశించి ఎనిదేళ్లు అవుతోంది. 2016 సెప్టెంబర్ లో ప్రారంభమైన నాటి నుంచి జియో వినూత్న ఆఫర్లతో యూజర్లను ఆకట్టకుంటూ అగ్రస్థానికి చేరి తన జైత్రయాత్రను కొనసాగిస్తూ వస్తోంది. సున్నా నుంచి 49 కోట్ల సబ్ స్క్రైబర్ బేస్ ను చేరుకుంది. అంతే కాకుండా సున్నా నుంచి 8% దాకా అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ ను పొందింది. ఫలితంగా డాటా వినియోగంలో 2016లో 155వ స్థానంలో ఉన్న భారత్ నేడే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఈ ఎనిమిదేళ్లలో దేశంలో డాటా వినియోగం 73 రేట్లు పెరిగింది. 2016లో సగటు జియో యూజర్ డేటా సగటు వినియోగం నెలకు 800 ఎంబీ కాగా ఇప్పుడది నెలకు 30 జీబీగా ఉంది.
సంచలనంగా..
ప్రారంభం నుంచి కూడా మార్కెట్లో సంచలనాలకు మారుపేరుగా నిలిచింది జియో. మొదటిసారిగా ఉచిత అపరిమిత కాల్స్‌ను, దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ ను ప్రవేశపెట్టింది. దేశానికి వాయిస్ ఓవర్ ఎల్టీఈ (వీవోఎల్‌టీఈ)ని తీసుకొచ్చిన ఘనత కూడా జియోదే. యూజర్ల కోసం మై జియో యాప్ ను కూడా ప్రవేశపెట్టింది. వై-ఫై కాలింగ్ ద్వారా కనెక్టివిటీ ఆప్షన్లను మరింతగా మెరుగుపర్చింది. ఇక 4జీ ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్ ను ప్రవేశపెట్టడం డిజిటల్ సేవల్లో విప్లవమనే చెప్పాలి. 4జీ మౌలిక వసతులపై ఆధారపడకుండా దేశంలో విడిగా 5జీ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసిన ఘనత కూడా జియోకే దక్కుతుంది.
విస్తరణ
జియో తన సర్వీస్ ఉత్పత్తులను ఏళ్లుగా క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. 2023లో జియో భారత్, జియో బుక్, జియో ఎయిర్ ఫైబర్ లను ప్రవేశపెట్టింది. జియో సబ్ స్క్రైబర్ల సంఖ్య ఊహకు అందని రీతిలో పెరిగింది. 2024 ఆగస్టు నాటికి 49 కోట్లకు చేరుకుంది. వారిలో 13 కోట్ల మంది 5జీ యూజర్లు ఉన్నారు. 2022లో జియో ట్రూ5జీ ఆవిష్కారం, 2021లో జియోఫోన్ నెక్ట్స్ ను ప్రవేశపెట్టడం, దేశంలో నంబర్ వన్ ఫైబర్ -టు-ది-హోమ్ (ఎఫ్ టీటీహెచ్) ప్రొవైడర్ జియో ఫైబర్ కావడం లాంటివి జియో సాధించిన మైలురాళ్లలో ముఖ్యమైనవి.
Comments
Please login to add a commentAdd a comment