టారిఫ్ పెంపుతో యూజర్లలో తీవ్ర అసంతృప్తిని మూటకట్టుకున్న రిలయన్స్ జియో, వారిని సంతృప్తి పరచడానికి కాస్త దిగివచ్చింది. తన రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్‌ని నిశ్శబ్దంగా తిరిగి ప్రవేశపెట్టింది.
ఎక్కువ మంది రీచార్జ్ చేసుకునే రూ.999 ప్లాన్ ధరను జూలై 3న రూ.1,199కి జియో పెంచేసింది. అయితే తాజాగా కొన్ని సవరించిన ప్లాన్ ఫీచర్‌లు, ప్రయోజనాలతో పాత ప్లాన్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది.
కొత్త రూ. 999 ప్లాన్‌లో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే, దాని పొడిగించిన వ్యాలిడిటీ. పాత ప్లాన్‌లో ఇది 84 రోజులు ఉండగా కొత్త ప్లాన్ 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే 14 రోజులు అదనపు వ్యాలిడిటీ లభిస్తుందన్నమాట. కానీ రోజువారీ డేటాను మాత్రం కొత్త ప్లాన్‌లో తగ్గించేశారు. గత ప్లాన్‌లో రోజుకు 3GB డేటా లభిస్తుండగా కొత్త ప్లాన్ రోజుకు 2GB డేటాను అందిస్తుంది. డేటా పరిమితి తగ్గినప్పటికీ దీంతో 5జీ డేటాను ఆనందించవచ్చు. ఇక రోజుకు 100 SMSలు, అపరిమిత వాయిస్ కాలింగ్ ఫీచర్లు ఉన్నాయి.
దీనికి పోటీగా ప్రత్యర్థి టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ కూడా రూ.979 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే అపరిమిత 5G డేటాను ఆనందించవచ్చు. ఇక ఎయిర్‌టెల్ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనం ఏమిటంటే, 56 రోజుల పాటు ఉచిత అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్.
Comments
Please login to add a commentAdd a comment