రిలయన్స్ జియో కోట్లాది మంది వినియోగదారులకు ఊరటను కలిగించింది. రీఛార్జ్ ప్లాన్‌ల ధరల పెంపు తర్వాత, వినియోగదారులు చౌకైన ప్లాన్‌ల కోసం చూస్తున్నారు. వీరి కోసం ఇప్పుడు కంపెనీ వినియోగదారుల కోసం రెండు చౌకైన ప్లాన్‌లను తీసుకొచ్చింది.
రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను ఈ నెల 3వ తేదీ నుంచి పెంచింది. దాదాపు 25 శాతం వరకు టారిఫ్‌లు పెరిగాయి. దీంతో అప్పటి వరకూ ఉన్న రూ. 149, రూ. 179 వంటి చౌక, సరసమైన ప్లాన్‌లను జియో
జాబితా నుండి తొలగించింది. దీంతో వాటిని రీచార్జ్ చేసుకునే యూజర్లు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అలాంటి యూజర్ల కోసం సరికొత్త చౌక ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ప్లాన్‌ల ధరలను రూ. 189, రూ. 479గా నిర్ణయించింది. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్‌లను మై జియో యాప్ నుంచి రీఛార్జ్ చేసుకోవాలి.
జియో రూ.189 ప్లాన్
రూ.189 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని ఇస్తుంది. ఏ నెట్‌వర్క్‌కైనా 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్ చేయవచ్చు. 300 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో 2GB డేటా మాత్రమే లభిస్తుంది. అన్ని సాధారణ ప్లాన్‌ల మాదిరిగానే, జియో కస్టమర్‌లకు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
జియో రూ. 479 ప్లాన్
దీర్ఘకాలం వ్యాలిడిటీ కోసం చూసే వినియోగదారులకు ఈ ప్లాన్ ఉత్తమమైనది. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత ఉచిత కాలింగ్, 1000 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో 84 రోజుల పాటు 6GB డేటాను అందిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment