చేతిలో స్మార్ట్‌ఫోన్, చెవుల్లో ఇయర్‌ఫోన్స్ ఉంటే చాలు..టీనేజ్‌కురాని పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకు.. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరు. ఏ సమయంలోనైనా.. ఎక్కడున్నా బయటి ప్రపంచంతో పనిలేదన్నట్టు స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో చక్కర్లు కొడుతుంటారు. ఇది ఎంత ప్రమాదకరమో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని గుర్తించిన చైనాలోని షియాన్ నగర అధికారులు ఫుట్‌పాత్ తరహాలో స్మార్ట్‌ఫోన్ వాకర్ల కోసం ప్రత్యేకంగా ‘స్మార్ట్‌పాత్’ను ఏర్పాటు చేశారు. షియాన్ సిటీలో అత్యంత రద్దీగా ఉండే యాంటా రోయాన్ ప్రాంతంలో ఈ ప్రత్యేక లైన్‌ను నిర్మించారు.
ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన ఈ లైన్‌పై మొబైల్ చిత్రాలను ఉంచారు. దీంతో అయినా ఫోన్ ప్రియులను ప్రమాదాల బారి నుంచి కాపాడవచ్చని భావిస్తున్నారు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. అదేంటంటే స్మార్ట్‌ఫోన్ వాకర్ల కోసం ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు చైనాలోని చాంగ్‌కింగ్ సిటీలో ఇదే తరహాలో స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆలోచన ఫోన్ ప్రియులపై ఏమాత్రం ప్రభావం చూపలేదంట. ఫోన్‌లోనే చూస్తూ.. అసలు తమకోసం ఏర్పాటు చేసిన ఈ స్మార్ట్‌పాత్‌నే వారు గమనించటం లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment