China govt
-
చైనాలో కోవిడ్ మరణ మృదంగం..అంతకంతకూ పెరిగిపోతున్న కేసులు
చైనాలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులతో కుదేలవుతోంది. దీనికి తోడు రోజుకు వేల సంఖ్యలో మరణాల సంభవించడంతో తీవ్ర భయాందోళనలతో సతమతమవుతోంది చైనా. అదీగాక బీజింగ్ కోవిడ్ ఆంక్షలు సడలించాక కేసులు ఘోరంగా పెరగడం ప్రారంభమై అందర్నీ విస్మయపర్చింది. ఈ క్రమంలో ఇటీవలే ఒక వారంలోనే దేశవ్యాప్తంగా ఆస్పత్రులలో దాదాపు 13 వేల మరణాలు సంభవించినట్లు నివేదికలో పేర్కొంది. మరణించిన వారిలో చాలామంది వైరస్ బారిన పడినవారేనని ఆరోగ్య అధికారి తెలిపారు. ఈ మేరకు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) కేవలం కరోనాతో ఆస్పత్రుల్లో చేరి శ్వాసకోస వైఫల్యంతో 681 మంది మరణించారని, కరోనా తోపాటు ఇతర వ్యాధుల కారణంగా సుమారు 11,977 మంది మరణించినట్లు పేర్కొంది. కానీ హోం క్వారంటైన్‌లోనే ఉండి చనిపోయిన వారి సంఖ్యను వెల్లడించలేదు. ఆంక్షలు సడలించాక జనవరి12 నాటికి ఒక్క నెలరోజుల్లోనే దాదాపు 60 వేల మరణాలు సంభవించాయని ఒక వారం ముందు వెల్లడించింది. అంతేగాదు కోవిడ్ ఆంక్షలను ఎత్తేసిన డిసెంబర్ నుంచి అంతకు ముందు కలిపి మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు ఆరు లక్షలకు పైగా ప్రజలు మరణించినట్లు తెలిపింది. చైనాలో జరుపుకునే లూనార్ న్యూ ఈయర్ వేడుకలకు ముందుగానే సుమారు 36 వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ వేడుకలను పురస్కరించుకుని మిలియన్ల మంది ప్రజలు తమ సొంతగ్రామాలకు రావడంతో ఈ కరోనా మరింత వ్యాప్తి చెందుతుందని భయాలు ఎక్కువయ్యాయి. ఐతే దేశంలో ఇప్పటికే 80 శాతం మంది ఈ వైరస్ బారిన పడ్డారు, కాబట్టి ఇప్పట్లో కరోనా సెకండ్‌వేవ్ వచ్చే అవకాశం లేదని చైనా సీడీసీలోని చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ వూ జున్ యూ అన్నారు. (చదవండి: కాలిఫోర్నియా: చైనీస్ న్యూఇయర్ పార్టీలో కాల్పులు.. పలువురి మృతి) -
మతిమరుపు వ్యాధికి మందు వచ్చేసింది
బీజింగ్: తీవ్ర మతిమరుపు వ్యాధి అయిన అల్జీమర్స్‌ను నయం చేసేందుకు చైనాలో కొత్త మందు మార్కెట్లోకి వచ్చింది. దీంతో ఈ వ్యాధితో బాధపడుతున్న కొన్ని లక్షల మందికి ఎంతో ఊరట చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బ్రౌన్ ఆల్గే (శైవలం) నుంచి సంగ్రహించిన ఈ మందు.. అల్జీమర్స్ వ్యాధికి ప్రపంచంలోనే కనుగొన్న మొట్ట మొదటిదని చైనాలోని నేషనల్ మెడికల్ ప్రోడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పేర్కొన్నారు. జీవీ–971గా పిలుస్తున్న ఈ మందుకు నవంబర్ 2న అధికారికంగా చైనా ప్రభుత్వం అనుమతులిచ్చింది. కాగా, ఆదివారం నుంచి మార్కెట్లోకి వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఏడాది పాటు వాడాలంటే ఒక రోగికి దాదాపు రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ మందును చైనాలో మెడికల్ ఇన్సూరెన్స్ జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తామని, దీంతో రీయింబర్స్మెంట్ చేసుకునే వీలు కలుగుతుందని షాంఘై గ్రీన్ వ్యాలీ ఫార్మాసూటికల్స్ చైర్మన్ సొంగ్టావో తెలిపారు. -
ఈ దారి.. స్మార్ట్‌ఫోన్ దారి..
చేతిలో స్మార్ట్‌ఫోన్, చెవుల్లో ఇయర్‌ఫోన్స్ ఉంటే చాలు..టీనేజ్కురాని పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకు.. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరు. ఏ సమయంలోనైనా.. ఎక్కడున్నా బయటి ప్రపంచంతో పనిలేదన్నట్టు స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో చక్కర్లు కొడుతుంటారు. ఇది ఎంత ప్రమాదకరమో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని గుర్తించిన చైనాలోని షియాన్ నగర అధికారులు ఫుట్‌పాత్ తరహాలో స్మార్ట్‌ఫోన్ వాకర్ల కోసం ప్రత్యేకంగా ‘స్మార్ట్పాత్’ను ఏర్పాటు చేశారు. షియాన్ సిటీలో అత్యంత రద్దీగా ఉండే యాంటా రోయాన్ ప్రాంతంలో ఈ ప్రత్యేక లైన్‌ను నిర్మించారు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన ఈ లైన్‌పై మొబైల్ చిత్రాలను ఉంచారు. దీంతో అయినా ఫోన్ ప్రియులను ప్రమాదాల బారి నుంచి కాపాడవచ్చని భావిస్తున్నారు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. అదేంటంటే స్మార్ట్‌ఫోన్ వాకర్ల కోసం ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు చైనాలోని చాంగ్కింగ్ సిటీలో ఇదే తరహాలో స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆలోచన ఫోన్ ప్రియులపై ఏమాత్రం ప్రభావం చూపలేదంట. ఫోన్లోనే చూస్తూ.. అసలు తమకోసం ఏర్పాటు చేసిన ఈ స్మార్ట్పాత్నే వారు గమనించటం లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. -
భారత యాత్రికులకు చైనా అడ్డంకి
గ్యాంగ్‌టక్: కైలాస మానస సరోవర్ యాత్రకు బయలుదేరిన 47 మందితో కూడిన భారత యాత్రికుల తొలి బృందాన్ని చైనా ప్రభుత్వం సరిహద్దు ప్రాంతంలోనే నిలిపివేసింది. టిబెట్, చైనా ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో ప్రవేశాన్ని నిరాకరించినట్లు చైనా అధికారులు పేర్కొన్నారు. వారిని స్వస్థలాలకు తిరిగి పంపించినట్లు తెలిపారు. జూన్ 15న సిక్కిం చేరిన ఈ తొలి బృందం19వ తేదీనే చైనాను దాటాల్సి ఉండగా.. ప్రతికూల వాతావ రణంతో శుక్రవారం వరకు బేస్ క్యాంప్‌లోనే ఉన్నారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్సులో కొండచరియలు విరిగిపడటంతో 15 మంది మృతి చెందగా, 100 మందిపైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. -
ఐఫోన్ కోసం కూతుర్ని ఆన్లైన్లో అమ్మేశారు!
బీజింగ్: ఐఫోన్ కొనడం కోసం శిశువును విక్రయించిన జంటకు చైనా ప్రభుత్వం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఎ.డ్యువాన్ అనే వ్యక్తి 18 రోజుల వయసున్న తన కుమార్తెను 3,530 డాలర్లకు ఆన్లైన్లో అమ్మేశాడు. అతని భార్య జియావో మెయి కూడా ఇందుకు సహకరించింది. ఈ సొమ్ముతో ఐఫోన్‌తో పాటు ఓ మోటార్‌సైకిల్‌ను కొనుక్కున్నారు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. శిశువును అమ్మడం నేరమనే విషయం తమకు తెలియదన్న డ్యువాన్ దంపతుల వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. భర్తకు మూడేళ్లు, భార్యకు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. -
స్పాంజి రహదారులు రానున్నాయి!
నిన్నగాక మొన్న మన మహానగరాల్లో కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. రహదారులు చిన్నపాటి వరద నీటి కాలువలయ్యాయి. వందలాది వాహనాలు నీట మునిగాయి. వీటన్నిటి మధ్య నోరు తెరచుకుని ఉన్న భయంకర మ్యాన్‌హోల్స్ మనుషుల్ని అమాంతం మింగేసేందుకు ఏమాత్రం వెనకాడలేదు. విశాఖలో గల్లంతైన చిన్నారి అదితినే ఇందుకు ఉదాహరణ. ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే..? వరదనీరు ఎక్కడికక్కడ ఇంకిపోవాలన్నదే నేటితరం సమాధానం. సాంకేతికత నానాటికీ అభివృద్ధి చెందుతోన్న ప్రస్తుత సమాజానికి స్పాంజి సిటీలు కావాలంటున్నారు నిపుణులు. ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో చైనా ఒకటి. అత్యధిక నగరాలున్న దేశం కూడా ఇదే. ఏకంగా 657 నగరాలు చైనాలో ఉన్నాయి. ఎక్కడ నగరాలు ఉంటే అక్కడ కచ్చితంగా తాగునీటి, వరదనీటి సమస్య ఉండితీరుతుంది. చైనా నగరాలు కూడా ఈ విషయంలో మినహాయింపేమీ కాదు. ఇక్కడి సగం నగరాల్లో ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం నీటి కొరత తీవ్రంగా ఉంది. మిగతా సగం వరదనీటి నియంత్రణ విషయంలో జాతీయ ప్రమాణాలు అందుకోలేదు. 2013 వరదల్లో 230 నగరాలు ముంపునకు గురవ్వడం, 90 శాతం నగర ప్రాంతాల్లో ప్రాథమిక వరద ప్రణాళికలు కూడా లేకపోవడం దీనికి ఉదాహరణలు. స్పాంజి నగరాలు.. దీంతో చైనా ప్రభుత్వం మేల్కొంది. తాజాగా ఆ దేశంలోని 16 నగరాలను స్పాంజి నగరాలుగా మార్చాలని నిర్ణయించుకుంది. ఈ కారణంగా రానున్న మూడేళ్లలో ఒక్కో నగరం 600 మిలియన్ల యువాన్లను అందుకోనుంది. ఈ నిధులతో కొలనులు, ఫిల్టరేషన్ పూల్స్, వెట్ల్యాండ్స్తో పాటు నీటిని పీల్చుకునే రహదారులు (పర్మియబుల్ రోడ్స్) నిర్మిస్తారు. వీటన్నిటి కలయికే స్పాంజి నగరం. ఈ ప్రణాళిక ఫలితంగా కనీసం 60 శాతం వర్షపునీటిని నియంత్రించవచ్చనేది అధికారుల అంచనా. అమెరికాలోని లాస్ఏంజిలీస్ క్వారీ ప్రాజెక్టులో ఇప్పటికే స్పాంజి నగర నమూనాని ప్రయోగాత్మకంగా చేపట్టారు. అయితే, ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పర్మియబుల్ రహదారులు.. స్పాంజి నగరాల్లో ప్రధానంగా ప్రస్తావించాల్సింది పర్మియబుల్ రహదారుల గురించే. పర్మియబుల్ కాంక్రీటుతో నిర్మించే ఈ రోడ్లు నీటిని అత్యంత వేగంగా లోపలికి పీల్చుకుంటాయి. రహదారులపై పడే నీరు క్షణాల్లో ఇంకిపోతుంది. ఈ తంతును చూస్తే కాంక్రీటులో స్పాంజి ఉందేమోనన్న అనుమానం కలుగుతుంది. అయితే, ఇందులో అలాంటిదేమీ ఉండదు. దీన్ని పెద్ద కంకర రాళ్లను ఉపయోగించి తయారుచేస్తారు. ఈ కాంక్రీటు మిశ్రమాన్ని సాధారణ రహదారుల్లో వినియోగించే చిన్న చిన్న కంకర రాళ్లపై గుమ్మరించడం ద్వారా రహదారులు తయారుచేస్తారు. ఇవి సగటున ఒక్కో చదరపు మీటరుకు నిమిషానికి 600 లీటర్ల నీటిని పీల్చుకోగలవు. పర్మియబుల్ కాంక్రీటు.. నీటిని పీల్చుకోగలిగే సామర్థ్యమున్న కాంక్రీటును 1800లోనే వినియోగించారు. యూరప్‌లోని గృహాల నిర్మాణంలో దీన్ని వాడారు. ఇందులో సిమెంట్ పాళ్లు తక్కువగా ఉండటంతో వ్యయం కూడా అదుపులోనే ఉంటోంది. 1920 నాటికి స్కాట్లండ్, ఇంగ్లండ్‌ల్లో రెండంతస్తుల భవనాలకు దీన్ని ఎక్కువగా వాడేవారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సిమెంటు లభ్యత తక్కువ కావడంతో దీనికి మరింత ఆదరణ పెరిగింది. అయితే, 1970 వరకూ అమెరికాలో ఇది పెద్దగా ప్రభావం చూపలేదు. మనదేశంలో 2000 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఉపయోగాలు.. - వర్షపు నీటిని పీల్చుకోవడం ద్వారా వరద నియంత్రణకు సహకరిస్తుంది. - భూగర్భ నిల్వలు పెంచడంలో సహాయపడుతుంది. - వాతావరణంలోని కార్బన్ ఉద్గారాలను పీల్చుకోవడం ద్వారా కాలుష్యాన్నినివారిస్తుంది. - వరదనీటిలోని కాలుష్యకారకాలను శుద్ధి చేయడం ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. - చెట్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. పర్యావరణానికి మేలు చేకూరుస్తుంది.