భారత యాత్రికులకు చైనా అడ్డంకి
గ్యాంగ్‌టక్: కైలాస మానస సరోవర్ యాత్రకు బయలుదేరిన 47 మందితో కూడిన భారత యాత్రికుల తొలి బృందాన్ని చైనా ప్రభుత్వం సరిహద్దు ప్రాంతంలోనే నిలిపివేసింది. టిబెట్, చైనా ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో ప్రవేశాన్ని నిరాకరించినట్లు చైనా అధికారులు పేర్కొన్నారు. వారిని స్వస్థలాలకు తిరిగి పంపించినట్లు తెలిపారు.
జూన్ 15న సిక్కిం చేరిన ఈ తొలి బృందం19వ తేదీనే చైనాను దాటాల్సి ఉండగా.. ప్రతికూల వాతావ రణంతో శుక్రవారం వరకు బేస్ క్యాంప్‌లోనే ఉన్నారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్సులో కొండచరియలు విరిగిపడటంతో 15 మంది మృతి చెందగా, 100 మందిపైగా శిథిలాల కింద చిక్కుకున్నారు.