ఐఫోన్ కోసం కూతుర్ని ఆన్‌లైన్లో అమ్మేశారు! | China couple sentenced to 3yr jail selling daughter online for iphone | Sakshi
Sakshi News home page

ఐఫోన్ కోసం కూతుర్ని ఆన్‌లైన్లో అమ్మేశారు!

Published Thu, Mar 10 2016 6:47 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

ఐఫోన్ కోసం కూతుర్ని ఆన్‌లైన్లో అమ్మేశారు!

ఐఫోన్ కోసం కూతుర్ని ఆన్‌లైన్లో అమ్మేశారు!

బీజింగ్: ఐఫోన్ కొనడం కోసం శిశువును విక్రయించిన జంటకు చైనా ప్రభుత్వం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఎ.డ్యువాన్ అనే వ్యక్తి 18 రోజుల వయసున్న తన కుమార్తెను 3,530 డాలర్లకు ఆన్‌లైన్లో అమ్మేశాడు. అతని భార్య జియావో మెయి కూడా ఇందుకు సహకరించింది.
 
 ఈ సొమ్ముతో ఐఫోన్‌తో పాటు ఓ మోటార్‌సైకిల్‌ను కొనుక్కున్నారు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. శిశువును అమ్మడం నేరమనే విషయం తమకు తెలియదన్న డ్యువాన్ దంపతుల వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. భర్తకు మూడేళ్లు, భార్యకు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement