daughter selling
-
కూతుర్ని అమ్మేసి, తల్లిపై హత్యాయత్నం
సాక్షి, కృష్ణా: జిల్లాలోని ముసునూరు మండలం వలసపల్లిలో అమానవీయ ఘటన చోటుచేసుకొంది. భార్య కళ్లుగప్పి ఓ భర్త కన్న కూతురిని అమ్మేశాడు. వివరాలు.. నవీన్‌బాబు అనే వ్యక్తి ఆడపిల్లలు పుడుతున్నారని తన తల్లిదండ్రులతో కలిసి భార్య రజనీని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈక్రమంలోనే మరోసారి తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన నవీన్‌బాబు నాలుగో కూతురిని లక్షా 50 వేల రూపాయలకు అమ్మేశాడు. అయితే, డబ్బుల పంపిణీలో నవీన్‌బాబుకు అతని తల్లిదండ్రులకు మధ్య వాగ్వివాదం జరగటంతో విషయం బయటపడింది. గాయాల నుంచి కోలుకున్న రజనీ తన బిడ్డ ఎక్కడనీ భర్త, అత్తమామలను నిలదీసింది. దీంతో వారంతా కలిసి మరోసారి రజనీపై దాడి చేసి హత్యాయత్నం చేశారు. వారి బారి నుంచి తప్పించుకున్న రజనీ తన తల్లి దండ్రులతో కలిసి బిడ్డ అమ్మకంపై ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, న్యాయం చేస్తాడనుకున్న ముసునూరు ఎస్ఐ మరోలా చేశాడు. బిడ్డను కొన్న దంపతులను స్టేషన్‌కి పిలిపించి తల్లి రజనీతో ఫొటోలు తీయించి తిరిగి వారికే అప్పగించాడు. ఎస్ఐ తీరుపై రజనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తన బిడ్డను ఇప్పించాలని బాధితురాలు నూజివీడు ఎమ్మెల్యేని ఆశ్రయించింది. (చదవండి: నకిలీ పోలీసుల గుట్టురట్టు) -
కూతురిని అమ్మకానికి పెట్టిన తండ్రి
-
కూతురిని అమ్మకానికి పెట్టిన తండ్రి
సాక్షి, గన్నవరం : ఆడిపిల్లగా జన్మించడమే ఓ చిన్నారికి శాపంగా మారింది. ఎనిమిది రోజుల పసికందును బేరానికి పెట్టాడు ఓ తండ్రి. ఆసుపత్రి నుండి ఇంటికి కూడా తీసుకువెళ్లక ముందే చిన్నారిని లక్షన్నరకు బేరం కుదుర్చుకున్నాడు. అల్లుడు పసిపాను బేరం పెట్టిన విషయాన్ని గమనించిన మామ నిలదీయడంతో కంగుతున్నాడు. ఈ అమానుష సంఘటన కృష్ణాజిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. నూజివీడు మండలం కొత్తూరు తండా సిద్దార్థ నగర్ కు చెందిన రాజేష్ నాలుగేళ్ళ క్రితం బాపులపాడు మండలం సింగన్నగూడెంకు చెందిన రజితను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. రజిత తండ్రి సవనాద్రికి ప్రేమ వివాహం ఇష్టం లేకపోయినా కూతురు సుఖంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అంగీకరించాడు. ఈ క్రమంలో గర్భం దాల్చిన రజిత మూడేళ్ల క్రితం మొదటి కాన్పులో మగ బిడ్డకు జన్మనిచ్చింది. రెండవ కాన్పుగా వారం క్రితం గన్నవరం పిన్నమనేని సిద్దార్థ హాస్పిటల్ లో ఇద్దరు ఆడకవలలకి జన్మనిచ్చింది. ఆడ పిల్లలంటే ఇష్టం లేని రాజేష్ ఇద్దరు ఆడపిల్లలు ఒకే కాన్పులో జన్మించడంతో ఒక చిన్నారిని భీమవరానికి చెందిన వారికి అమ్మేయడానికి రంగం సిద్ధం చేసాడు. అల్లుడు ప్రవర్తనను గమనించిన మామ సవనాద్రి అల్లుడితో ఘర్షణకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో అక్కడ ఉన్న హాస్పిటల్ యాజమాన్యం విషయం తెలుసుకునేలోపు రాజేష్ అక్కడ నుండి జారుకున్నాడు. రజిత తండ్రి మాత్రం ఎంతమంది పిల్లలు అయినా తాను చూసుకుంటాని తెలిపాడు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన రాజేష్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
ఐఫోన్ కోసం కూతుర్ని ఆన్లైన్లో అమ్మేశారు!
బీజింగ్: ఐఫోన్ కొనడం కోసం శిశువును విక్రయించిన జంటకు చైనా ప్రభుత్వం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఎ.డ్యువాన్ అనే వ్యక్తి 18 రోజుల వయసున్న తన కుమార్తెను 3,530 డాలర్లకు ఆన్లైన్లో అమ్మేశాడు. అతని భార్య జియావో మెయి కూడా ఇందుకు సహకరించింది. ఈ సొమ్ముతో ఐఫోన్‌తో పాటు ఓ మోటార్‌సైకిల్‌ను కొనుక్కున్నారు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. శిశువును అమ్మడం నేరమనే విషయం తమకు తెలియదన్న డ్యువాన్ దంపతుల వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. భర్తకు మూడేళ్లు, భార్యకు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది.