'స్మార్ట్' యూజర్లకు ‘వాకింగ్ లేన్’ రెడీ..
బెల్జియం (ఆంట్వెర్ప్) : మార్కెట్ ఏదైనా రద్దీ కామన్. జనాలు తోసుకుంటూ, తొక్కుకుంటూ, అటూఇటూ చూసుకుంటూ నడుస్తూ ఢీకొట్టుకోవడమూ కామనే. అయితే, బెల్జియంలోని ఆంట్వెర్ప్ సిటీలో రద్దీగా ఉండే ఈ మార్కెట్లో ఇటీవల జనాలు ఢీకొట్టుకోవడం మరీ ఎక్కువైపోయిందట. ఇక్కడి జనాలకు స్మార్ట్‌ఫోన్ పిచ్చి ఎక్కువ కావడమే అందుకు కారణమట. మార్కెట్‌లో నడుస్తున్నప్పుడూ చాలామంది స్మార్ట్‌ఫోన్‌లో అక్షరాలు టైప్ చేసుకుంటూ వెళుతుండటంతో పరస్పరం ఢీకొట్టుకుంటున్నారట. అందుకే వీధికి మధ్యలో ఇలా రెండు గీతలతో ‘టెక్స్ట్ వాకింగ్ లేన్’ వేశారు.
స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ లేన్‌లోనే నడుచుకుంటూ వె ళ్లాలన్నమాట. ఇటీవల డ్యామేజీ అయిన స్మార్ట్‌ఫోన్లతో వినియోగదారులు రావడం పెరగడంతో ఓ మొబైల్ షాపు ఓనర్ అక్కడి అధికారులకు ఈ ఐడియా ఇచ్చాడట. కానీ చాలా మంది ఈ లేన్‌ను పట్టించుకోకుండా ఎప్పటిలాగే అడ్డదిడ్డంగా నడుస్తున్నారట. అన్నట్టూ.. అమెరికాలోని వాషింగ్టన్, చైనాలోని చోంగ్‌క్వింగ్ నగరాల్లో కూడా ఇలాంటి లేన్లు వేశారు.