రోజుకు 4 బిలియన్ డాలర్లు నష్టపోయే ట్విటర్‌ను సుమారు రూ. 3.37 లక్షల కోట్లు పెట్టి ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాను చేసిన కొనుగోలు వల్లే ట్విటర్ యూజర్లు పెరిగిపోతున్నారంటూ మస్క్ చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
మస్క్ చేతుల్లోకి వెళ్లిన నాటి నుంచి గతంలో కంటే ఎక్కువ మంది యూజర్లు యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో ట్విటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. కానీ ఇతర సోషల్ మీడియా నెట్ వర్క్‌లైన మాస్టోడాన్, టంబ్లర్ డౌన్‌లోడ్‌ల కంటే ట్విటర్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే వారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన డేటా హైలెట్ చేస్తోంది.
►సెన్సార్ టవర్ నివేదిక ప్రకారం.. మస్క్ ట్విట్టర్ బాస్‌గా బాధ్యతలు చేపట్టిన 12 రోజుల్లో ట్విటర్ డౌన్‌లోడ్‌లు 657శాతం పెరిగాయి.
►అదే సమయంలో యాహూకు చెందిన టంబ్లర్‌ను ఒక్క అమెరికాలో 96శాతం మంది ఇన్‌స్టాల్ చేసుకోగా, వరల్డ్ వైడ్‌గా 77శాతం మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ట్విటర్ ఇన్‌స్టాల్‌లు 21శాతం పెరిగాయి.
►మాస్టోడాన్‌లో వరల్డ్ వైడ్‌గా 1 మిలియన్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. జూలై నాటికి ట్విటర్‌లో 238 మిలియన్ల మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు.
అయినప్పటికీ , ట్విటర్‌కు మస్క్ బాస్ అవ్వడంతో యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా యూజర్లు మాస్టోడాన్ వైపు మొగ్గుచూపుతున్నారని సెన్సార్ టవర్ నివేదిక చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment