శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్‌మీడియా నెట్‌ర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ కు చెందిన మెసేంజెర్ యాప్ దూసుకుపోతోంది. ప్రతినెలా యూజర్ల పరంగా భారీ వృద్ధిని నమోదు చేస్తోంది. 130కోట్ల యాక్టివ్ యూజర్లతో ప్రపంచ వ్యాప్తంగా తన హవాను కొనసాగిస్తోంది. ఫేస్‌బుక్ సొంతమైన మరో మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు సమానంగా యూజర్లను ఆకట్టుకుంటోంది. ప్రతినెల ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల మెసెంజర్ ప్రతి నెల ఉపయోగిస్తున్నారని ఫేస్‌బుక్ అధికారికంగా ప్రకటించింది.
గత ఏడాది జూలైలో వన్‌బిలియన్ యాక్టివ్ యూజర్ల మార్క్‌ను అధిగమించిన మెసెంజర్ యూజర్లను మరింత ఆకట్టుకుంటోందని ఫేస్‌బుక్ తెలిపింది. మెసెంజర్ ఉత్తమంగా ఉండటం, కొత్త మాస్క్, ఫిల్టర్లు, వీడియో చాట్ లాంటి అంశాలు దీనికి దోహదం చేసినట్టుతెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ప్రదేశాల్లో తమ వర్చ్యువల్ పెర్సనల్ అసిస్టెంట్ త్వరలో అందుబాటులో తేనున్నట్టు ఫేస్‌బుక్ పోస్ట్ లో శుక్రవారం వెల్లడించింది. అంతేకాదు కాదు ఇన్‌బాక్స్ పునఃరూపకల్పనతో మరిన్ని మార్పులను తీసుకొస్తామని తెలిపింది. ఇందుకు ప్రతి వినియోగదారుడికి కృతజ్ఞతలు తెలిపింది.
కాగా ఫేస్‌బుక్ ఆధ్వర్యంలోని వాట్సాప్‌కు 1.3బిలియన్ల యూజర్లు ఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌కు 700 మిలియన్ నెలవారీ వినియోగదారులు నమోదువుతున్నారు. అలాగే 200 మిలియన్ల మంది ప్రతి రోజు 'స్టోరీస్' ఫీచర్ ఉపయోగిస్తున్నారు. మరోవైపు సమీప ప్రత్యర్థి స్నాప్‌చాట్ రోజువారీ యూజర్లు 166 మిలియన్ మాత్రమే.