
సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
న్యూఢిల్లీ : ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ను లాంఛ్ చేయనుంది. తమతో అరుదుగా ఇంటరాక్ట్ అయ్యే ప్రొఫైల్స్‌ను ఎంపిక చేసి వాటిపై యూజర్లకు అన్‌ఫాలో సజెషన్స్‌ను ఇచ్చే ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ యూజర్లకు తమ సన్నిహిత మిత్రుల గ్రూప్‌ను సార్ట్ చేసేందుకు, చురుకుగా లేని ఫాలోయర్లను అవాయిడ్ చేసేందుకు సహకరిస్తుంది. ఇప్పటినుంచి ‘మీ ఫీడ్‌ను ఏయే ఇన్‌స్టా ఖాతాలు చురుకుగా పరిశీలిస్తున్నాయి..మీతో ఎవరు ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు.. ఏ ఖాతాలను అవాయిడ్ చేయవచ్చు అనే అంశాలన్నింటినీ మీరు ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చ’ని తాజా ఫీచర్ గురించి వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ ముసోరి ట్వీట్ చేశారు. తాజా ఫీచర్‌తో ఎంపిక చేసిన ఫీడ్ ద్వారా యూజర్ మరింత ఎక్కువ సేపు యాప్‌లో గడపటంతో పాటు సైట్‌కు సైతం అధిక వ్యూస్ వస్తాయని భావిస్తున్నారు. మరి ఈ ఫీచర్‌పై ఇన్‌స్టా యూజర్లు ఎలా స్పందిస్తారు..ఇది తన ఉద్దేశాలను నెరవేరుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.