సాక్షి,ముంబై: ఆన్‌లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో తన కస్టమర్లకు నోరూరించేవార్త చెప్పింది. తమ వినియోగదారులు ఇప్పుడు భారతదేశంలోని అన్ని నగరాల నుండి తమకు ఇష్టమైన వంటకాలను ఆర్డర్ చేసి మరుసటి రోజేవాటిని డెలివరీ చేసుకోవచ్చట. దేశంలోని ప్రముఖ నగరాల నుంచి ఆర్డర్ చేసిన వంటకాలు మరుసటి రోజు కస్టమర్లకు డెలివరీ చేయనుంది. (Anand Mahindra వీడియో వైరల్: లాస్ట్ ట్విస్ట్ ఏదైతో ఉందో..)
ఈ విషయాన్ని జొమాటో ఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుండి బాగా ఇష్టపడే కొన్ని వంటకాలను తన కస్టమర్లకు రుచి చూపించనున్నట్టు తెలిపారు. తమ ఇంటి వద్ద నుండే ఐకానిక్ వంటకాలను ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చని వెల్లడించారు. భారతదేశంలోని ప్రతిమూల ఏదో అద్భుతమైన వంటకం ఉంది. కోల్‌కతా రసగుల్లా, హైదరాబాద్ బిర్యానీ, లక్నో కబాబ్స్, జైపూర్ కచోరీ, పాత ఢిల్లీ నుండి బటర్ చికెన్ లేదా ప్యాజ్ వంటి వంటకాలను ఆర్డర్ చేసి ఆస్వాదించవచ్చు. దేశంలోని పాపులర్ వంటకాలు ఏవైనా ఇంటర్‌సిటీ లెజెండ్స్ద్వారా పొందవచ్చు.అంతేకాదురంగురుచీవాసన,నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా బెస్ట్‌ఫుడ్ అందిస్తామని కూడా చెప్పారు. (పెప్సీ, కోకా-కోలాకు రిలయన్స్ షాక్: కాంపా కోలా రీఎంట్రీ)
ప్రస్తుతానికి ఇప్పుడు (ప్రస్తుతానికి పరిమిత ప్రదేశాలలో పైలట్ ప్రాజెక్టుగా) జొమాటో యాప్ ద్వారా ఈ ఐకానిక్ వంటకాలను ఆర్డర్ చేసుకోవచ్చు అని ట్వీట్ చేశారు. బిజినెస్-టు-బిజినెస్ నేరుగా ‘హైపర్‌ప్యూర్’ విధానంలో సరఫరా చేయనున్నామని పేర్కొన్నారు. తన ఫుడ్ డెలివరీ వ్యాపారం కంటే ఇది చాలా పెద్దది కానుందని జొమాటో పేర్కొంది. ప్రస్తుతానికి, కొత్త ‘ఇంటర్‌సిటీ లెజెండ్స్’ సేవను గుర్గావ్ .దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపింది.
There's a jewel in every corner of India – Baked Rosogollas from Kolkata, Biryani from Hyderabad, or Kebabs from Lucknow. Zomato's Intercity legends (pilot at limited locations for now) now lets you order these iconic dishes through our app.
— Deepinder Goyal (@deepigoyal) August 31, 2022
Read more: https://t.co/O8DOR23Wk5 pic.twitter.com/peL55DgRYM
Comments
Please login to add a commentAdd a comment