across India
-
నోరూరించే వార్త చెప్పిన జొమాటో.. బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో తన కస్టమర్లకు నోరూరించేవార్త చెప్పింది. తమ వినియోగదారులు ఇప్పుడు భారతదేశంలోని అన్ని నగరాల నుండి తమకు ఇష్టమైన వంటకాలను ఆర్డర్ చేసి మరుసటి రోజేవాటిని డెలివరీ చేసుకోవచ్చట. దేశంలోని ప్రముఖ నగరాల నుంచి ఆర్డర్ చేసిన వంటకాలు మరుసటి రోజు కస్టమర్లకు డెలివరీ చేయనుంది. (Anand Mahindra వీడియో వైరల్: లాస్ట్ ట్విస్ట్ ఏదైతో ఉందో..) ఈ విషయాన్ని జొమాటో ఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుండి బాగా ఇష్టపడే కొన్ని వంటకాలను తన కస్టమర్లకు రుచి చూపించనున్నట్టు తెలిపారు. తమ ఇంటి వద్ద నుండే ఐకానిక్ వంటకాలను ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చని వెల్లడించారు. భారతదేశంలోని ప్రతిమూల ఏదో అద్భుతమైన వంటకం ఉంది. కోల్‌కతా రసగుల్లా, హైదరాబాద్ బిర్యానీ, లక్నో కబాబ్స్, జైపూర్ కచోరీ, పాత ఢిల్లీ నుండి బటర్ చికెన్ లేదా ప్యాజ్ వంటి వంటకాలను ఆర్డర్ చేసి ఆస్వాదించవచ్చు. దేశంలోని పాపులర్ వంటకాలు ఏవైనా ఇంటర్సిటీ లెజెండ్స్ద్వారా పొందవచ్చు.అంతేకాదురంగురుచీవాసన,నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా బెస్ట్‌ఫుడ్ అందిస్తామని కూడా చెప్పారు. (పెప్సీ, కోకా-కోలాకు రిలయన్స్ షాక్: కాంపా కోలా రీఎంట్రీ) ప్రస్తుతానికి ఇప్పుడు (ప్రస్తుతానికి పరిమిత ప్రదేశాలలో పైలట్ ప్రాజెక్టుగా) జొమాటో యాప్ ద్వారా ఈ ఐకానిక్ వంటకాలను ఆర్డర్ చేసుకోవచ్చు అని ట్వీట్ చేశారు. బిజినెస్-టు-బిజినెస్ నేరుగా ‘హైపర్‌ప్యూర్’ విధానంలో సరఫరా చేయనున్నామని పేర్కొన్నారు. తన ఫుడ్ డెలివరీ వ్యాపారం కంటే ఇది చాలా పెద్దది కానుందని జొమాటో పేర్కొంది. ప్రస్తుతానికి, కొత్త ‘ఇంటర్సిటీ లెజెండ్స్’ సేవను గుర్గావ్ .దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. There's a jewel in every corner of India – Baked Rosogollas from Kolkata, Biryani from Hyderabad, or Kebabs from Lucknow. Zomato's Intercity legends (pilot at limited locations for now) now lets you order these iconic dishes through our app. Read more: https://t.co/O8DOR23Wk5 pic.twitter.com/peL55DgRYM — Deepinder Goyal (@deepigoyal) August 31, 2022 -
ఎయిర్ టెల్ వినియోగదారులకు భారీ షాకింగ్ న్యూస్!
-
గ్రేట్ జర్నీ.. సోలోగా.. ధైర్యంగా
‘ఆకాశమే మన హద్దు... అవకాశాలను వదలద్దు’ ఇదేదో పర్సనాలిటీ డెవలప్మెంట్ నినాదంలా అనిపిస్తోంది. కానీ ఈ అడ్వంచరస్ ఉమన్ గురుదీపక్ కౌర్‌ను చూస్తే ఇలాంటి మరెన్నో స్ఫూర్తివచనాలు చెప్పాలనిపిస్తుంది. 73 ఏళ్ల వయసులో ఆమె సొంతంగా కారు నడుపుకుంటూ ఒంటరిగా కొత్త ప్రదేశాలను చూడడానికి వెళ్తుంటారు. సోలో ట్రావెలర్, సోలో ఉమెన్ ట్రావెలర్... ఇవేవీ గురుదీపక్కు సరిపోకపోవచ్చు. సీనియర్ సోలో అడ్వెంచరస్ ట్రావెలర్ అనాల్సిందే. ఆమె మాత్రం ‘వయసు ఒక సంఖ్య మాత్రమే. మన ఉత్సాహానికి వయసు అడ్డుకట్ట వేయలేదు. బాధ్యతలు కొంత వరకు వేగాన్ని అదుపు చేస్తుంటాయి. కానీ నాకు బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ఫ్రీ బర్డ్ని. కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు నా చేత ప్రయాణం చేయిస్తున్నది... ప్రపంచాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఒక్కటే’’ అంటారు. మూడు రోజుల రైలు ప్రయాణం జీవితంలో పరిస్థితులే తన చేత ఒంటరి ప్రయాణాలు చేయించాయంటారు గురుదీపక్ కౌర్. ‘‘నాన్న మిలటరీ పర్సన్, బదిలీలుంటాయి. పన్నెండేళ్ల వయసు నుంచి ప్రయాణం అంటే మా వస్తువులు మేమే ప్యాక్ చేసుకుని సిద్ధం అయ్యేవాళ్లం. ‘ప్యాకింగ్, మూవింగ్, మీటింగ్ న్యూ పీపుల్’ ఇదే మా లైఫ్. ఇక ఒంటరి ప్రయాణాలు పెళ్లి తర్వాత మొదలయ్యాయి. నా భర్త కూడా మిలటరీ పర్సనే. పెళ్లయిన తర్వాత రెండో ఏడాదిలో ఆయనకు కర్నాటక, బెల్గామ్‌లో పోస్టింగ్ వచ్చింది. చండీగర్ నుంచి రెండు నెలల బాబుతో, ఎనిమిది పెద్ద పెద్ద చెక్క పెట్టెలతో బెల్గామ్‌కు ప్రయాణమయ్యాను. అప్పట్లో విమానాలు ఇంత ఎక్కువగా ఉండేవి కావు. రైల్లో మూడు రోజుల ప్రయాణం. అది నా తొలి ఒంటరి ప్రయాణం మాత్రమే కాదు, సాహసోపేతమైన ప్రయాణం కూడా. కారులో షికారు గురుదీపక్ కౌర్ తొలి సోలో ఇంటర్నేషనల్ టూర్ 1994లో చేశారు. యూఎస్‌కు ఒంటరిగా వెళ్లడం మాత్రమే కాదు, స్థానికంగా ప్రదేశాలను చూడడానికి రైల్లో ఒంటరిగానే ప్రయాణించారు. ఇదంతా బాగానే ఉంది. కానీ సొంతంగా కారు నడుపుకుంటూ ప్రయాణించడం 2013లో మొదలైంది. సాంత్రో కారులో చండీగర్ నుంచి బెంగళూరుకు బయలుదేరారు గురుదీపక్ కౌర్. ఢిల్లీ, అజ్మీర్, ఉదయ్‌పూర్, అహ్మదాబాద్, ముంబయి మీదుగా బెంగళూరు చేరారు. ఆ తర్వాత ఏడాది ఉత్తరాఖండ్‌కు కారు తీశారు. కొండలు, లోయల మధ్య మెలికలు తిరిగిన రోడ్డు మీద కారు నడుపుతూ తాను చూడదలుచుకున్న ప్రదేశాలను చుట్టి వచ్చారు. ప్రమాదం తప్పింది దేహం అలసటగా ఉన్నప్పుడు ట్రిప్ మొదలు పెట్టవద్దని చెబుతారు కౌర్. దేహం ఫిట్‌గా ఉందా నీరసంగా ఉందా అనేది ఎవరికి వాళ్లకు తెలుస్తుంది. దేహం అలసటకు మానసిక అలసట కూడా తోడైతే... ఇక వాహనం నడప కూడదని చెబుతూ మూడేళ్ల కిందట తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పారామె. ‘‘ముంబయికి వెళ్లినప్పుడు కారు నడుపుతూ తీవ్రమైన అలసటతో రోడ్డు పక్కన కారాపి కొన్ని క్షణాలపాటు స్టీరింగ్ మీద తల వాల్చాను. మెలకువ వచ్చేసరికి కారు కదులుతోంది. అప్పటికే చెట్ల పొదల్లోకి వచ్చేసింది. వెంటనే అప్రమత్తమై బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది’’. ఇల్లు అపురూపమే... ‘‘ప్రతి మహిళకూ నేను చెప్పేది ఒక్కటే. ఇల్లు, కుటుంబం బాధ్యతలు ఎలాగూ ఉంటాయి. బాధ్యతల పట్ల బాధ్యతరహితంగా ఉండవద్దు. బాధ్యతలతోపాటు మీకూ కొంత సమయం కేటాయించుకోండి. మీకంటూ సొంతంగా కొంత డబ్బు ఉంచుకోండి. ఏడాదిలో కొన్ని రోజులు మీరు మీరుగా జీవించండి. ఆ తర్వాత తిరిగి మీ బాధ్యతల వలయంలోకి వచ్చి పడినప్పటికీ అప్పుడు ఆ బాధ్యత బరువుగా అనిపించదు. మానసికంగా ఒత్తిడిని కలిగించదు. మనకు ఇల్లు అపురూపమైనదే, అలాగే ప్రపంచం అందమైనది. ఆ అందానికి కూడా మన జీవితంలో స్థానం కల్పించాలనే విషయాన్ని మర్చిపోవద్దు’’ అంటారు గురుదీపక్ కౌర్. -
రణరంగంగా మారిన దేశ రాజధాని
-
ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ బుధవారం మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కంటే చౌక ధరలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా రూ.259 రీచార్జ్ పై 10జీబీ 4జీ డేటా ఆఫర్ చేస్తోంది. వినియోగదారులు కొత్తగా కొనుగోలు చేసిన ఏ 4 జీ స్మార్ట్ ఫోన్ కైనా ఈ ఆఫర్ ను అందించనుంది. ఈ ఇన్విటేషనల్ ఆఫర్ ద్వారా దేశమంతా తాము అమలు చేస్తున్న4జీ నెట్ వర్క్ ను యూజర్లకు అందుబాటులోకి వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిర్ టెల్ బిజినెస్ డైరెక్టర్ అజయ్ పూరి తెలిపారు. ఒక జిబి డేటా తక్షణమే వినియోగదారుని ఖాతాలో జమ చేయబడుతుందనీ, మిగిలిన 9 జీబీ డేటా మై ఎయిర్ టెల్ ఆప్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చని ఎయిర్ టెల్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. 4 జీ అందుబాటులో లేనిచోట 3జీ డాటా వాడుకోవచ్చని తెలిపింది. గరిష్టంగా 90 రోజుల్లో మూడుసార్లు రీచార్జ్ చేసుకునేందుకు ఈ తాజా ఆఫర్ అనుమతినిస్తుంది. ఇటీవల గుజరాత్, మధ్య ప్రదేశ్, చత్తీస్గడ్ లో ప్రారంభించిన ఈ ఆఫర్ ను ఇపుడు దేశమంతా వర్తింపచేస్తోంది. కాగా ఆగస్ట్ లో రూ.250 రీచార్జ్ తో 10 జీబీ 4 జీ డాటాను కేవలం శాంసంగ్ గెలాక్సీ జె సీరిస్ స్మార్ట్ ఫోన్లకు మాత్రమే ఆఫర్ చేసింది. తాజా ఆఫర్ ప్రకారం 4 జీ స్మార్ట్ ఫోన్లు అన్నింటికీ ఈ డాటా సేవలు వర్తింప చేస్తోంది.