పాటల వింటూ పనిచేయండి అంటూ ఉద్యోగులకు టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈమెయిల్ పెట్టినట్లు అమెరికన్ మీడియా పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఎలన్‌మస్క్ టెస్లా ఉద్యోగులకు పంపిన మరో ఈమెయిల్స్‌ను అమెరికన్ మీడియా సీఎన్‌బీసీ బట్టబయలు చేసింది. వీటిలో ఎలన్ మస్క్ ఉద్యోగులపై మితీమిరి ప్రవర్తించనట్లుగా తెలుస్తోంది. లీకైన ఈ మెయిల్‌ల ప్రకారం....ఆర్డర్‌లను అమలు చేయని లేదా పలు విషయాల్లో ఉద్యోగులు ఎందుకు తప్పు చేశారో వివరించని వారు వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుందని ఎలన్ మస్క్ చెప్పినట్లు తెలుస్తోంది. .
ఈ ఏడాది అక్టోబర్‌లో టెస్లా ఉద్యోగులకు రెండు ఈమెయిల్స్‌ను మస్క్ పంపారు. తొలి మెయిల్‌లో పాటలు వింటూ వర్క్‌ను ఎంజాయ్ చేయండి అంటూ ఉద్యోగులకు వెల్లడించగా..మరో మెయిల్‌లో ఉద్యోగులు కంపెనీ ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తే వారు అందుకు తగిన సమాధానాలను ఇవ్వాలని మస్క్ తన మెయిల్స్‌లో పేర్కొన్నారు. ఒకవేళ ఎలాంటి రిప్లే ఇవ్వకుండా ఉంటే...తక్షణమే ఆయా ఉద్యోగులు రాజీనామా చేస్తే బాగుంటుందని తన మెయిల్స్‌లో ఎలన్ మస్క్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
అక్టోబర్ మొదటి వారంలో రెండు ఈ-మెయిల్‌లను మస్క్ టెస్లాలోని అందరికీ పంపారు. అదే సమయంలో టెస్లా 2021 మూడవ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 241,300 వాహనాలను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. దాంతో పాటుగా పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ బీటా వెర్షన్ కూడా ప్రారంభించింది. అంతేకాకుండా జాత్యాంహాకార వ్యాఖ్యల దావాలో కూడా టెస్లా ఓడిపోయింది.
చదవండి: టెస్లాకు చెక్‌పెట్టనున్న ఫోర్డ్..! అదే జరిగితే..?
Comments
Please login to add a commentAdd a comment