
కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గెజిట్‌ను గవర్నర్ జారీ చేశారు.
సాక్షి, విజయవాడ: కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గెజిట్‌ను గవర్నర్ జారీ చేశారు. (ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్)
కాంట్రాక్టు ఉద్యోగుల చిరకాల వాంఛను సీఎం జగన్ నెరవేర్చారు. వివిధ శాఖల్లో సుమారు 10,117 మంది ఫుల్‌టైం కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్ అయ్యారు. వీలైనంత ఎక్కువ మందికి మేలు చేసేలా 2–6–2014కు ముందు ఐదేళ్లు సర్వీసు ఉండాలనే నిబంధనలను సీఎం జగన్ సడలించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ చేస్తున్నందుకు సీఎంకు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.