న్యూఢిల్లీ: గోద్రెజ్ ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ రూ.2,000 కోట్ల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకుంది. పవర్ ట్రాన్స్‌మిషన్, రైల్వేస్, సోలార్ ప్రాజెక్టుల నుంచి తమ అనుబంధ కంపెనీ ద పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రెనివేబుల్ ఎనర్జీ వీటిని అందుకుందని సంస్థ గురువారం ప్రకటించింది. రూ.900 కోట్ల ఆర్డరుతో రైల్వే ఎలక్ట్రిఫికేషన్ విభాగంలోకి గోద్రెజ్ ప్రవేశించినట్టు అయింది. అలాగే గోద్రెజ్ తన పోర్ట్‌ఫోలియోను ఈహెచ్‌వీ కేబుల్, ఈహెచ్‌వీ సబ్‌స్టేషన్, ట్రాక్షన్ సబ్‌స్టేషన్, సోలార్ ప్రాజెక్ట్‌లలో దేశవ్యాప్తంగా, అలాగే నేపాల్‌లో విస్తరించింది.
(ఇదీ చదవండి: అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?)
ఎస్‌బీఐ అకౌంట్ బ్రాంచ్ మార్చుకోవాలా? ఇదిగో ఇలా సింపుల్‌గా
Comments
Please login to add a commentAdd a comment