ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌ఓ బదిలీ
Published Mon, Jun 5 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM
కర్నూలు(హాస్పిటల్) : కర్నూలు జిల్లా ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వై.నరసింహులు బదిలీ అయ్యారు. ఆయనను చిత్తూరు జిల్లా అడిషనల్ డీఎంహెచ్‌ఓగా బదిలీ చేస్తూ సోమవారం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాంతీయ శిక్షణా కేంద్రం(మేల్) ప్రిన్సిపల్‌గా ఉన్న డాక్టర్ వై.నరసింహులును నాలుగు రోజుల క్రితం సాధారణ బదిలీల్లో భాగంగా చిత్తూరు జిల్లా అడిషనల్ డీఎంహెచ్‌ఓగా బదిలీ అయ్యారు. అయితే కర్నూలు డీఎంహెచ్‌ఓ డాక్టర్ మీనాక్షి మహదేవ్ ఏసీబీకి పట్టుబడటంతో ఆమె స్థానంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ నరసింహులును నియమించారు. కాగా సోమవారం తాజా ఉత్తర్వుల మేరకు ఆయనను చిత్తూరు జిల్లాకు బదిలీ చేస్తూన్నట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయనతో పాటు జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు సైతం కడప జిల్లాకు బదిలీ అయ్యారు.
Advertisement
Advertisement