Incharge DMHO
-
ఇన్చార్జి డీఎంఅండ్‌హెచ్‌ఓ బదిలీ
కర్నూలు(హాస్పిటల్) : కర్నూలు జిల్లా ఇన్చార్జి డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వై.నరసింహులు బదిలీ అయ్యారు. ఆయనను చిత్తూరు జిల్లా అడిషనల్ డీఎంహెచ్‌ఓగా బదిలీ చేస్తూ సోమవారం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాంతీయ శిక్షణా కేంద్రం(మేల్) ప్రిన్సిపల్‌గా ఉన్న డాక్టర్ వై.నరసింహులును నాలుగు రోజుల క్రితం సాధారణ బదిలీల్లో భాగంగా చిత్తూరు జిల్లా అడిషనల్ డీఎంహెచ్‌ఓగా బదిలీ అయ్యారు. అయితే కర్నూలు డీఎంహెచ్ఓ డాక్టర్ మీనాక్షి మహదేవ్ ఏసీబీకి పట్టుబడటంతో ఆమె స్థానంలో ఇన్చార్జి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ నరసింహులును నియమించారు. కాగా సోమవారం తాజా ఉత్తర్వుల మేరకు ఆయనను చిత్తూరు జిల్లాకు బదిలీ చేస్తూన్నట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయనతో పాటు జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు సైతం కడప జిల్లాకు బదిలీ అయ్యారు. -
ఇన్చార్జి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ వై.నరసింహులు
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్చార్జి అధికారిగా డాక్టర్ వై. నరసింహులుకు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ అరుణకుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీఎంహెచ్ఓ డాక్టర్ మీనాక్షి మహదేవ్ ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రాంతీయ శిక్షణా కేంద్రం(మేల్) ప్రిన్సిపల్‌గా ఉన్న డాక్టర్ వై.నరసింహులు ఇకపై ఫిమేల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్‌గా, అడిషనల్ డీఎంహెచ్‌ఓగా, డీఎంహెచ్‌ఓగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించనున్నారు. కీలక పోస్టులన్నీ ఖాళీ డీఎంహెచ్ఓ డాక్టర్ మీనాక్షి మహదేవ్ ఏసీబీకి పట్టుబడటంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కీలక పోస్టులన్నీ దాదాపు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం ఆమె ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్) ప్రిన్సిపల్‌గా రెగ్యులర్ పోస్టులో ఉన్నారు. డాక్టర్ స్వరాజ్యలక్ష్మిపై ఏసీబీ దాడుల నేపథ్యంలో ఆమెకు అడిషనల్ డీఎంహెచ్‌ఓగా, డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా డాక్టర్ మీనాక్షి మహదేవ్ సైతం ఏసీబీకి పట్టుబడటంతో ఒకేసారి మూడు పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. దీంతో పాటు ఇప్పటికే ఎయిడ్స్ అండ్ లెప్రసి అధికారి సెలవులో వెళ్లడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. మలేరియా అధికారి పోస్టు సైతం ఇన్చార్జితో కొనసాగుతోంది. జిల్లా క్షయ నియంత్రణాధికారిగా ఉన్న డాక్టర్ మోక్షేశ్వరుడు, ప్రాంతీయ శిక్షణా కేంద్రం(మేల్) ప్రిన్సిపల్ డాక్టర్ వై.నరసింహులు సైతం బదిలీ కానుండగా, కొందరు వైద్యులు కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. -
విజృంభిస్తున్న విషజ్వరాలు
జిల్లా కేంద్ర ఆస్పత్రికి క్యూ కడుతున్న జ్వర పీడితులు అప్రమత్తత, పరిశుభ్రత ముఖ్యమంటున్న వైద్యులు సంగారెడ్డి టౌన్: వర్షాకాలంలో వచ్చే జబ్బులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే జిల్లాలో విషజ్వరాలు, అతిసార, డెంగీ, మలేరియా విజృంభిస్తున్నాయి. ఈక్రమంలో డెంగీతో సంగారెడ్డి పట్టణానికి చెందిన బాలరాజు సోలాంకి మృతిచెందిన విషయం తెలిసిందే. కలుషిత నీటితో కౌడిపల్లి మండలం బండ్లపోతుగల్ గ్రామం మొత్తానికి అతిసార సోకింది. వారం రోజులుగా జిల్లా కేంద్ర ఆస్పత్రికి విషజ్వర పీడితులు వస్తూనే ఉన్నారు. ముందస్తు జాగ్రత్తలు అవసరం కౌడిపల్లి మండలంలోని చిట్కూల్ గ్రామం, టేక్మాల్ మండలం, శివ్వంపేట మండలాల్లో కొన్ని గ్రామాలు విషజ్వరాలు, అతిసార విజృంభిస్తున్నాయి. జిల్లా మొత్తం వీటి బాధితులు ఎక్కువగానే ఉన్నారు. ఈనేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని, వ్యాధుల బారిన పడకుండా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రోడ్లపై మురుగు, చెత్తాచెదారం పేరుకుపోవడం.. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో దోమలు వృద్ధి చెందుతాయన్నారు. ఫలితంగా మలేరియా, డెంగీ అధికమయ్యే ప్రమాదం ఉంది. కలుషిత నీరు తాగడం, అపరిశుభ్ర ఆహారం తీసుకోవడం వల్ల అతిసార సోకుతుందని చెప్పారు. గ్రామాల్లో బహిరంగ మల విసర్జన వల్ల ఎక్కువగా అంటురోగాలు వ్యాప్తి చెందుతాయన్నారు. నెలలు తరబడి శుభ్రం చేయని ట్యాంకులో నీరు తాగడం కూడా ప్రమాదకరమని పేర్కొన్నారు. ట్యాంకుల్లో తరచూ క్లోరినేషన్, మురుగుకాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని వారు సూచిస్తున్నారు. పరిశుభ్రత ముఖ్యం పరిశుభ్రంగా ఉంటే ఏ రోగాలు రావు. ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. కాచి వడపోసిన నీటినే తాగాలి. వాటర్ ట్యాంకులు 15 రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి. తినక ముందు, తిన్న తర్వాత.. మరుగుదొడ్డికి వెళ్లొచ్చిన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి. రెండుమూడుసార్లు విరోచనాలు అయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. - డాక్టర్ అమర్‌సింగ్ నాయక్, ఇన్చార్జి డీఎంహెచ్ఓ విషజ్వరాలు, వర్షాకాలం, ఇన్చార్జి డీఎంహెచ్ఓ