
సాక్షి, హైదరాబాద్ : ఏపీ రాజధాని రైతులకు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వం రాజధాని భూసేకరణకు అవార్డు జారీ చేయకుండా స్టే విధిస్తూ మంగళవారం కోర్టు ఉత్తర్వులు వెలువరించింది.
పెనుమాక, బేతపూడి, నవులూరు, కురగల్లు గ్రామాల రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. వీరి తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వం భూసేకరణ అవార్డు చేపట్టకుండా స్టే విధించింది.
రెండు వారాల్లో పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment