రాజస్థాన్‌లోని దౌసాలో ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ 150 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. రెస్క్యూ సిబ్బంది 56 గంటల పాటు శ్రమించినప్పటికీ ఆ బాలుడిని సజీవంగా బయటకు తీసుకురాలేకపోయారు. మన దేశంలో బోరుబావి ప్రమాద ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. బోరుబావుల యజమానులకు ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ, వారి నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.
గత ఏడాది(2023) మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో బోరుబావిలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. బాలికను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు 50 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ, ప్రయోజనం లేకపోయింది. గతంలో గుజరాత్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 2023 జూన్ 2న జామ్‌నగర్‌లో రెండేళ్ల బాలిక 20 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. 19 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాలికను బయటకు తీశారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతిచెందింది. ఇదేవిధంగా మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో 8 ఏళ్ల తన్మయ్ బోరుబావిలో పడి మృతిచెందాడు. నాడు 84 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో తన్మయ్‌ని బయటకు తీసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే తన్మయ్ మృతి చెందాడు.
బోరుబావి మరణాల పిటిషన్ సుమోటాగా స్వీకరించిన సుప్రీం
గత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే బోరుబావుల్లో పడిన చిన్నారులు ఊపిరాడక మృతి చెందుతున్నరని స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రమాదాలకు అంతంలేదా అనే ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతుంటుంది. ఎన్‌సీఆర్‌బీ నివేదిక లోని వివరాల ప్రకారం గత నాలుగేళ్లలో దేశంలోని 281 మంది చిన్నారులు బోరు బావిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2010లో బోర్‌వెల్‌లో పడి చిన్నారులు మరణిస్తున్న అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.
ప్రమాదాల నివారణకు సుప్రీం ఆదేశాలు
అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ బెంచ్ బోర్‌వెల్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల ప్రకారం బోర్‌వెల్ తవ్వే ముందు భూమి యజమాని ఆ విషయాన్ని ఆ ప్రాంతపు అధికారులకు తెలియజేయాలి. అలాగే అధికారుల పర్యవేక్షణలో బోరుబావి తవ్వకాలు జరగాలి. బావి తవ్వేటప్పుడు ఆ విషయాన్ని తెలియజేస్తూ, ఒక్కడ ఒక బోర్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.
బోర్‌వెల్ చూట్టూ మళ్లకంచె లేదా..
ఇదేవిధంగా బోర్‌వెల్ చుట్టూ ముళ్ల కంచెలు వేయాలి. లేదా బోర్‌వెల్ చుట్టూ కాంక్రీట్ గోడ నిర్మించాలి. బోర్‌వెల్ పని పూర్తయిన తర్వాత బోర్‌వెల్ లేదా బావిని కవర్ చేయడానికి దానిపై మందపాటి కవర్‌ను కప్పాలి. ఈ మార్గదర్శకాలు అమలయ్యేలా చూడటం స్థానిక అధికారుల బాధ్యత. బోర్‌వెల్‌లు లేదా గొట్టపు బావుల్లో పడి చిన్నారులు మృతిచెందుతున్న అంశం కోర్టు దృష్టికి వచ్చిందని, అందుకే ఈ విషయంలో చొరవచూపామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇటువంటి సంఘటనలను నివారించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని వివిధ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీచేసింది.
ఇది కూడా చదవండి: దేశరాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మారిన వేళ..https://www.sakshi.com/telugu-news/national/why-british-regime-transfer-capital-kolkata-delhi-2288846
Comments
Please login to add a commentAdd a comment