borewell child death
-
బోరుబావి ప్రమాదాలు.. ఒకసారి విఫలం.. మరోసారి సఫలం
రాజస్థాన్‌లో మరో బోరుబావి దుర్ఘటన చోటుచేసుకుంది. బోరుబావిలో పడిపోయిన చిన్నారి చేతన(3)ను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రెస్క్యూ సిబ్బంది 10 రోజుల ప్రయత్నాల అనంతరం ఆ చిన్నారిని విగతజీవిగా బయటకు తీసుకువచ్చారు. ఇటువంటి దుర్ఘటనలు గతంలోనూ అనేకం చోటుచేసుకున్నాయి.ప్రిన్స్ కుమార్ కశ్యప్ (హర్యానా) 2006లో హర్యానాలోని ఒక బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల ప్రిన్స్ కుమార్ కశ్యప్‌ను రక్షించేందుకు భారీ ఆపరేషన్ నిర్వహించారు. హర్యానాలోని కురుక్షేత్రలోని ఓ గ్రామంలో 55 అడుగుల లోతైన బోరుబావిలో ప్రిన్స్ పడిపోయాడు. దాదాపు 48 గంటల తర్వాత రెస్క్యూ సిబ్బంది ప్రిన్స్‌ను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. నాడు బాధిత బాలుడు సురక్షితంగా బయటపడాలని కాంక్షిస్తూ దేశవ్యాప్తంగా చాలామంది పూజలు, యజ్ఞాలు నిర్వహించారు.మహి(హర్యానా) 2012, జూన్‌లో హర్యానాకు చెందిన ఐదేళ్ల మహి తన స్నేహితులతో ఆడుకుంటూ 60 అడుగుల పాడుబడిన బోరుబావిలో పడిపోయింది. ఐదు రోజుల పాటు సైన్యం, జిల్లా యంత్రాంగం భారీ ప్రయత్నాలు చేసినప్పటికీ బాలికను రక్షించలేకపోయింది. ఒక భారీ రాయి రెస్క్యూ ఆపరేషన్‌కు అడ్డంకిగా నిలిచింది.సాయి బర్హతే (మహారాష్ట్ర)2017, మే నెలలో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని కోపర్గావ్లో ఏడేళ్ల బాలుడు సాయి బర్హతే బోరుబావిలో పడిపోయాడు. రెస్క్యూ సిబ్బంది పలు ప్రయత్నాలు చేసినప్పటికీ బాలుడిని రక్షించలేకపోయారు.నదీమ్ (హర్యానా)2019, మార్చిలో హిసార్ జిల్లాలోని బల్సామంద్ గ్రామంలో 55 అడుగుల లోతైన బోర్‌వెల్‌లో ఒకటిన్నర ఏళ్ల బాలుడు నదీమ్ పడిపోయాడు. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం విభాగాల 48 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత బాలుడిని రక్షించారు. బోరుబావికి సమాంతర గొయ్యి తవ్వడం కోసం దాదాపు 40 జేసీబీ యంత్రాలను వినియోగించారు. 150 మంది పోలీసులతో పాటు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 100 మంది సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.సీమ (రాజస్థాన్)2019, మే నెలలో జోధ్‌పూర్‌లోని మెలానా గ్రామంలో 440 అడుగుల లోతైన బోరుబావిలో సీమ అనే నాలుగేళ్ల బాలిక పడిపోయింది. 260 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన చిన్నారిని బయటకు తెచ్చేందుకు 14 గంటల ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది. బాలిక మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. బాలిక తండ్రి మరమ్మతుల కోసం బోరుబావిని తెరిచి ఉంచిన కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. ఫతేవీర్ సింగ్ (పంజాబ్)2019, జూన్‌లో రెండేళ్ల ఫతేవీర్ సింగ్ ఆడుకుంటూ 120 అడుగుల లోతైన బోర్‌వెల్‌లో పడిపోయాడు. 109 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ, బాలుడిని రక్షించలేకపోయాడు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఎన్డిఆర్ఎఫ్ భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పటికీ, ప్రయోజనం లేకపోయింది. అధికారులు బాధిత చిన్నారికి ఆక్సిజన్ సరఫరా చేయగలిగినప్పటికీ, ఆహారం లేదా నీరు అందించలేకపోయారు.రితేష్ జవాసింగ్ సోలంకి (మహారాష్ట్ర)2021 నవంబర్‌లో ఆరేళ్ల బాలుడు రితేష్ జవాసింగ్ సోలంకి 200 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బందికి 16 గంటల సమయం పట్టింది.గుజరాత్2022 జూన్ 9న, గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. సైన్యం, అగ్నిమాపక దళం, పోలీసులు, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమై బాలుడిని రక్షించగలిగారు.పంజాబ్2022, మే 22న పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో 100 అడుగుల లోతైన బోరుబావిలో ఆరేళ్ల బాలుడు పడిపోయాడు. తొమ్మిది గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనప్పటికీ ఫలితం లేకపోయింది.సుప్రీంకోర్టు మార్గదర్శకాలు2009లో బోరుబావి ప్రమాదాలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. 2010లో వీటిని సవరించింది. వీటిలో బోరుబావి నిర్మాణ సమయంలో బావి చుట్టూ ముళ్ల కంచెను ఏర్పాటు చేయడం, బావి అసెంబ్లీపై బోల్ట్‌లతో స్టీల్ ప్లేట్ కవర్లను అమర్చడం, బోరుబావి పాడయినప్పుడు దానిని మూసివేయడం మొదలైనవి ఉన్నాయి. ఇది కూడా చదవండి: New Year 2025: ఇకపై పుట్టేవారంతా ‘బీటా బేబీస్’ -
బోరుబావి ప్రమాదాలకు అంతం లేదా? నాలుగేళ్లలో 281 మంది చిన్నారులు మృతి
రాజస్థాన్‌లోని దౌసాలో ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ 150 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. రెస్క్యూ సిబ్బంది 56 గంటల పాటు శ్రమించినప్పటికీ ఆ బాలుడిని సజీవంగా బయటకు తీసుకురాలేకపోయారు. మన దేశంలో బోరుబావి ప్రమాద ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. బోరుబావుల యజమానులకు ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ, వారి నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.గత ఏడాది(2023) మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో బోరుబావిలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. బాలికను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు 50 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ, ప్రయోజనం లేకపోయింది. గతంలో గుజరాత్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 2023 జూన్ 2న జామ్‌నగర్‌లో రెండేళ్ల బాలిక 20 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. 19 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాలికను బయటకు తీశారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతిచెందింది. ఇదేవిధంగా మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో 8 ఏళ్ల తన్మయ్ బోరుబావిలో పడి మృతిచెందాడు. నాడు 84 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో తన్మయ్‌ని బయటకు తీసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే తన్మయ్ మృతి చెందాడు.బోరుబావి మరణాల పిటిషన్ సుమోటాగా స్వీకరించిన సుప్రీంగత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే బోరుబావుల్లో పడిన చిన్నారులు ఊపిరాడక మృతి చెందుతున్నరని స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రమాదాలకు అంతంలేదా అనే ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతుంటుంది. ఎన్సీఆర్బీ నివేదిక లోని వివరాల ప్రకారం గత నాలుగేళ్లలో దేశంలోని 281 మంది చిన్నారులు బోరు బావిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2010లో బోర్‌వెల్‌లో పడి చిన్నారులు మరణిస్తున్న అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.ప్రమాదాల నివారణకు సుప్రీం ఆదేశాలుఅప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ బెంచ్ బోర్వెల్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల ప్రకారం బోర్వెల్ తవ్వే ముందు భూమి యజమాని ఆ విషయాన్ని ఆ ప్రాంతపు అధికారులకు తెలియజేయాలి. అలాగే అధికారుల పర్యవేక్షణలో బోరుబావి తవ్వకాలు జరగాలి. బావి తవ్వేటప్పుడు ఆ విషయాన్ని తెలియజేస్తూ, ఒక్కడ ఒక బోర్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.బోర్వెల్ చూట్టూ మళ్లకంచె లేదా..ఇదేవిధంగా బోర్వెల్ చుట్టూ ముళ్ల కంచెలు వేయాలి. లేదా బోర్వెల్ చుట్టూ కాంక్రీట్ గోడ నిర్మించాలి. బోర్వెల్ పని పూర్తయిన తర్వాత బోర్వెల్ లేదా బావిని కవర్ చేయడానికి దానిపై మందపాటి కవర్‌ను కప్పాలి. ఈ మార్గదర్శకాలు అమలయ్యేలా చూడటం స్థానిక అధికారుల బాధ్యత. బోర్వెల్లు లేదా గొట్టపు బావుల్లో పడి చిన్నారులు మృతిచెందుతున్న అంశం కోర్టు దృష్టికి వచ్చిందని, అందుకే ఈ విషయంలో చొరవచూపామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇటువంటి సంఘటనలను నివారించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని వివిధ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీచేసింది. ఇది కూడా చదవండి: దేశరాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మారిన వేళ..https://www.sakshi.com/telugu-news/national/why-british-regime-transfer-capital-kolkata-delhi-2288846 -
‘అమ్మా కాపాడు..’ అని అరుస్తూ ఆ పసిగుండె ఆగింది
ఐదేళ్ల పసిబాలుడు.. ఐదు రోజుల పాటు చీకటి ఊబిలాంటి బావిలో అల్లాడిపోయాడు. ఆకలి, ఆక్సిజన్ అందిస్తూ అభయం అందించినా.. భయంతో ‘అమ్మా.. పైకి లాగమ్మా’ అంటూ వేసిన కేకలు కోట్ల మందిని చలింపజేశాయి. నిర్విరామంగా కృషి చేసిన సహాయక సిబ్బంది.. ఆ చిన్నారిని చేరుకునేలోపే నష్టం జరిగిపోయింది. ఆ చిన్నారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయింది. బోరుబావి విషాద ఘటన.. మొరాకోలో మాత్రమే కాదు ఆ మాటకొస్తే ఇంటర్నెట్ ప్రపంచం మొత్తానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. రయాన్ అవ్రామ్ వయసు ఐదేళ్లు. షెఫ్షావూలోని తన ఇంటి దగ్గర పోయిన మంగళవారం ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ 32 మీటర్ల లోతైన బోరుబావిలో పడిపోయాడు. పిల్లాడు సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తప్పిపోయాడేమోనని అంతా వెతికారు. అయితే, సమీపంలోని బోరు బావి నుంచి కేకలు వినిపిస్తుండడంతో అప్రమత్తమైన స్థానికులు.. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. లైట్లు వేసి చూశారు. తనను పైకి లాగాలంటూ ఆ చిన్నారి ఆర్తనాదాలు చేశాడు. వెంటనే అధికారులకు సమాచారమివ్వగా వారొచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఐదు రోజుల పాటు ఆపరేషన్ సాగింది. పిల్లాడికి గొట్టం ద్వారా తిండి, నీళ్లు, ఆక్సిజన్ పంపించారు. ఊపిరి ఆడక ఆ చిన్నారి ఆక్సిజన్ పైపు దగ్గరికి ముఖం పోనిచ్చిన వీడియోలు, ఫొటోలు వైరల్ కావడం.. పలువురిని కంటతడి పెట్టించింది. నాన్‌స్టాప్ ఆపరేషన్ పిల్లాడిని బతికించేందుకు బోరుబావికి సమాంతరంగా అధికారులు సొరంగం తవ్వడానికి తీవ్రంగా శ్రమించారు. భారీ ఎత్తున జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు స్థానికులు సైతం సహకరించారు. వాళ్ల కోసం వంటవార్పు సిద్ధం చేసి.. సహాయక కార్యక్రమాలు ఆగిపోకుండా చూసుకున్నారు. మరోవైపు దేశం మొత్తం, ఇంటర్నెట్ నిండా ఆ బాలుడు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనల పోస్టులు కనిపించాయి. ఐదురోజుల శ్రమ అనంతరం బాలుడు ఇరుకున్న చోటుకు చేరుకున్నారు. కానీ, అప్పటికే ఆ పిల్లాడి ఊపిరి ఆగిపోయింది. విగత జీవిగా మారిన తమ బిడ్డను చేతుల్లోకి తీసుకుని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మొరాకో వ్యాప్తంగా పాఠశాలల్లో నివాళిగా పిల్లలు ర్యాలీలు తీశారు. ఘటనపై గురించి తెలిసి మొరాకో రాజు మహ్మద్ సంతాపం తెలిపారు. Morocco moves a mountain to save a child 🇲🇦#SaveRayan 🇲🇦 humanity first ✊🏿✊🏿 pic.twitter.com/fp2jaSW8fL — Distinguished Senator (@Senatorisiaq) February 5, 2022 Minutes after the announcement of the death of the child #Rayan in Morocco, a young man from Palestine, Hamza Mansour, has a child and calls him #Rayan, in solidarity with the cause of the Moroccan child Rayan and in honor of his memory 💔🇲🇦🇵🇸 #Ryan pic.twitter.com/9m28efE78x — Simø Elyouzghi (@Mohamed365076) February 6, 2022 బా అంకుల్ కంటతడి పెట్టిన వేళ.. రయాన్ మరణవార్త తెలిసిన తర్వాత.. మొరాకో మొత్తం విషాదంలోకి కూరుకుపోయింది. చాలా చోట్ల ఆ చిన్నారికి నివాళులు అర్పించారు. పాలస్తీనాకు చెందిన ఓ తండ్రి.. అప్పుడే పుట్టిన తన బిడ్డను రయాన్ అని పేరు పెట్టడం విశేషం. బా అలీ.. మొరాకో మొత్తం బా అంకుల్ అని ముద్దుగా పిల్చుకుంటుంది. బోరు బావులను తవ్వడంలో నేర్పరి అయిన బా అలీ.. గతంలోనూ ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్లు ఎన్నో నిర్వహించారు కూడా. వంద గంటలపాటు నాన్‌స్టాప్‌గా పని చేసిన బా అంకుల్.. చివరికి చిన్నారి రయాన్ ప్రాణాలతో లేడనే విషయం తెలిసి కన్నీళ్ల ప్రాయం అయ్యాడు. Rest In Peace to Rayan 👼🏻 So sad. Was praying he would make it out of the well safe, but God had other plans for this little boy 💔Praying for his family 🙏🏼 #Rayan pic.twitter.com/6ESpSoehFT — ENISA (@IAmENISA) February 5, 2022 All the love & respect to Ba (uncle) Ali who dug with his hand for more than 100 straight hours to help in Rayan's rescue operation. Ba Ali, a well-drilling expert who never cared about the looming risk & insisted on contributing his long experience to save the little #Rayan. 😞 pic.twitter.com/escoatEs8Z — Zouhir • ⵣⵓⵁⵉⵔ (@oskai_z) February 6, 2022 #Rayan may have not survived but they are still heroes. Along with parents of Ryan No one can estimate the immense pain of the rescue workers who worked 24x7 to save him May Allah grant them paradise also 🤲🏽 #Ryan#PrayforRayan #ريان_المغرب #الطفل_ريان pic.twitter.com/C4948V9mbN — Mubeen ❄️ (@MubeenFatma) February 5, 2022 -
పనికిరాని బోరుబావులను మూసేయండి
అన్ని జిల్లాల కలెక్టర్లకు మంత్రి కేటీఆర్ ఆదేశం నల్లగొండలో శాన్వి మృతిపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా వల్లాల గ్రామంలోని బోరుబావిలో పడి రెండేళ్ల బాలిక శాన్వి మృతి చెందడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. శాన్వి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శాన్వి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే మంత్రి కేటీఆర్.. నల్లగొండ జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డికి ఫోన్‌చేసి మాట్లాడారు. నిరుపయోగంగా ఉన్న, పనికిరాని బోరుబావులను మూసివేయాలని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈ సంఘటన జరగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. ప్రమాదకరమైన బోరుబావుల విషయమై ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. యజమానిపై క్రిమినల్ కేసు పెట్టండి పనికి రాని బోరుబావులను మూసేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఈ ప్రమాదానికి కారణమైన భూమి యజమానిపై క్రిమినల్ కేసు పెట్టాలని మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. గతంలో పలుమార్లు అధికారుల ద్వారా, మీడియా ద్వారా బోరుబావుల విషయమై ప్రచారం నిర్వహించామని, అయినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. పనికిరాని బోరుబావుల మూసివేత కార్యక్రమాన్ని అవసరమైతే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు.