Bore Wells case
-
బోరుబావి ప్రమాదాలు.. ఒకసారి విఫలం.. మరోసారి సఫలం
రాజస్థాన్‌లో మరో బోరుబావి దుర్ఘటన చోటుచేసుకుంది. బోరుబావిలో పడిపోయిన చిన్నారి చేతన(3)ను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రెస్క్యూ సిబ్బంది 10 రోజుల ప్రయత్నాల అనంతరం ఆ చిన్నారిని విగతజీవిగా బయటకు తీసుకువచ్చారు. ఇటువంటి దుర్ఘటనలు గతంలోనూ అనేకం చోటుచేసుకున్నాయి.ప్రిన్స్ కుమార్ కశ్యప్ (హర్యానా) 2006లో హర్యానాలోని ఒక బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల ప్రిన్స్ కుమార్ కశ్యప్‌ను రక్షించేందుకు భారీ ఆపరేషన్ నిర్వహించారు. హర్యానాలోని కురుక్షేత్రలోని ఓ గ్రామంలో 55 అడుగుల లోతైన బోరుబావిలో ప్రిన్స్ పడిపోయాడు. దాదాపు 48 గంటల తర్వాత రెస్క్యూ సిబ్బంది ప్రిన్స్‌ను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. నాడు బాధిత బాలుడు సురక్షితంగా బయటపడాలని కాంక్షిస్తూ దేశవ్యాప్తంగా చాలామంది పూజలు, యజ్ఞాలు నిర్వహించారు.మహి(హర్యానా) 2012, జూన్‌లో హర్యానాకు చెందిన ఐదేళ్ల మహి తన స్నేహితులతో ఆడుకుంటూ 60 అడుగుల పాడుబడిన బోరుబావిలో పడిపోయింది. ఐదు రోజుల పాటు సైన్యం, జిల్లా యంత్రాంగం భారీ ప్రయత్నాలు చేసినప్పటికీ బాలికను రక్షించలేకపోయింది. ఒక భారీ రాయి రెస్క్యూ ఆపరేషన్‌కు అడ్డంకిగా నిలిచింది.సాయి బర్హతే (మహారాష్ట్ర)2017, మే నెలలో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని కోపర్గావ్లో ఏడేళ్ల బాలుడు సాయి బర్హతే బోరుబావిలో పడిపోయాడు. రెస్క్యూ సిబ్బంది పలు ప్రయత్నాలు చేసినప్పటికీ బాలుడిని రక్షించలేకపోయారు.నదీమ్ (హర్యానా)2019, మార్చిలో హిసార్ జిల్లాలోని బల్సామంద్ గ్రామంలో 55 అడుగుల లోతైన బోర్‌వెల్‌లో ఒకటిన్నర ఏళ్ల బాలుడు నదీమ్ పడిపోయాడు. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం విభాగాల 48 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత బాలుడిని రక్షించారు. బోరుబావికి సమాంతర గొయ్యి తవ్వడం కోసం దాదాపు 40 జేసీబీ యంత్రాలను వినియోగించారు. 150 మంది పోలీసులతో పాటు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 100 మంది సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.సీమ (రాజస్థాన్)2019, మే నెలలో జోధ్‌పూర్‌లోని మెలానా గ్రామంలో 440 అడుగుల లోతైన బోరుబావిలో సీమ అనే నాలుగేళ్ల బాలిక పడిపోయింది. 260 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన చిన్నారిని బయటకు తెచ్చేందుకు 14 గంటల ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది. బాలిక మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. బాలిక తండ్రి మరమ్మతుల కోసం బోరుబావిని తెరిచి ఉంచిన కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. ఫతేవీర్ సింగ్ (పంజాబ్)2019, జూన్‌లో రెండేళ్ల ఫతేవీర్ సింగ్ ఆడుకుంటూ 120 అడుగుల లోతైన బోర్‌వెల్‌లో పడిపోయాడు. 109 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ, బాలుడిని రక్షించలేకపోయాడు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఎన్డిఆర్ఎఫ్ భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పటికీ, ప్రయోజనం లేకపోయింది. అధికారులు బాధిత చిన్నారికి ఆక్సిజన్ సరఫరా చేయగలిగినప్పటికీ, ఆహారం లేదా నీరు అందించలేకపోయారు.రితేష్ జవాసింగ్ సోలంకి (మహారాష్ట్ర)2021 నవంబర్‌లో ఆరేళ్ల బాలుడు రితేష్ జవాసింగ్ సోలంకి 200 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బందికి 16 గంటల సమయం పట్టింది.గుజరాత్2022 జూన్ 9న, గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. సైన్యం, అగ్నిమాపక దళం, పోలీసులు, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమై బాలుడిని రక్షించగలిగారు.పంజాబ్2022, మే 22న పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో 100 అడుగుల లోతైన బోరుబావిలో ఆరేళ్ల బాలుడు పడిపోయాడు. తొమ్మిది గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనప్పటికీ ఫలితం లేకపోయింది.సుప్రీంకోర్టు మార్గదర్శకాలు2009లో బోరుబావి ప్రమాదాలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. 2010లో వీటిని సవరించింది. వీటిలో బోరుబావి నిర్మాణ సమయంలో బావి చుట్టూ ముళ్ల కంచెను ఏర్పాటు చేయడం, బావి అసెంబ్లీపై బోల్ట్‌లతో స్టీల్ ప్లేట్ కవర్లను అమర్చడం, బోరుబావి పాడయినప్పుడు దానిని మూసివేయడం మొదలైనవి ఉన్నాయి. ఇది కూడా చదవండి: New Year 2025: ఇకపై పుట్టేవారంతా ‘బీటా బేబీస్’ -
బోరుబావి ప్రమాదాలకు అంతం లేదా? నాలుగేళ్లలో 281 మంది చిన్నారులు మృతి
రాజస్థాన్‌లోని దౌసాలో ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ 150 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. రెస్క్యూ సిబ్బంది 56 గంటల పాటు శ్రమించినప్పటికీ ఆ బాలుడిని సజీవంగా బయటకు తీసుకురాలేకపోయారు. మన దేశంలో బోరుబావి ప్రమాద ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. బోరుబావుల యజమానులకు ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ, వారి నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.గత ఏడాది(2023) మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో బోరుబావిలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. బాలికను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు 50 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ, ప్రయోజనం లేకపోయింది. గతంలో గుజరాత్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 2023 జూన్ 2న జామ్‌నగర్‌లో రెండేళ్ల బాలిక 20 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. 19 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాలికను బయటకు తీశారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతిచెందింది. ఇదేవిధంగా మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో 8 ఏళ్ల తన్మయ్ బోరుబావిలో పడి మృతిచెందాడు. నాడు 84 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో తన్మయ్‌ని బయటకు తీసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే తన్మయ్ మృతి చెందాడు.బోరుబావి మరణాల పిటిషన్ సుమోటాగా స్వీకరించిన సుప్రీంగత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే బోరుబావుల్లో పడిన చిన్నారులు ఊపిరాడక మృతి చెందుతున్నరని స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రమాదాలకు అంతంలేదా అనే ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతుంటుంది. ఎన్సీఆర్బీ నివేదిక లోని వివరాల ప్రకారం గత నాలుగేళ్లలో దేశంలోని 281 మంది చిన్నారులు బోరు బావిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2010లో బోర్‌వెల్‌లో పడి చిన్నారులు మరణిస్తున్న అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.ప్రమాదాల నివారణకు సుప్రీం ఆదేశాలుఅప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ బెంచ్ బోర్వెల్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల ప్రకారం బోర్వెల్ తవ్వే ముందు భూమి యజమాని ఆ విషయాన్ని ఆ ప్రాంతపు అధికారులకు తెలియజేయాలి. అలాగే అధికారుల పర్యవేక్షణలో బోరుబావి తవ్వకాలు జరగాలి. బావి తవ్వేటప్పుడు ఆ విషయాన్ని తెలియజేస్తూ, ఒక్కడ ఒక బోర్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.బోర్వెల్ చూట్టూ మళ్లకంచె లేదా..ఇదేవిధంగా బోర్వెల్ చుట్టూ ముళ్ల కంచెలు వేయాలి. లేదా బోర్వెల్ చుట్టూ కాంక్రీట్ గోడ నిర్మించాలి. బోర్వెల్ పని పూర్తయిన తర్వాత బోర్వెల్ లేదా బావిని కవర్ చేయడానికి దానిపై మందపాటి కవర్‌ను కప్పాలి. ఈ మార్గదర్శకాలు అమలయ్యేలా చూడటం స్థానిక అధికారుల బాధ్యత. బోర్వెల్లు లేదా గొట్టపు బావుల్లో పడి చిన్నారులు మృతిచెందుతున్న అంశం కోర్టు దృష్టికి వచ్చిందని, అందుకే ఈ విషయంలో చొరవచూపామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇటువంటి సంఘటనలను నివారించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని వివిధ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీచేసింది. ఇది కూడా చదవండి: దేశరాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మారిన వేళ..https://www.sakshi.com/telugu-news/national/why-british-regime-transfer-capital-kolkata-delhi-2288846 -
కోర్టులంటే జోక్ అయిపోయిందా?
- బోరు బావుల కేసులో రెవెన్యూ ముఖ్య కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం - నివేదిక కోరితే రెండు కాగితాలు మా ముఖాన కొడతారా? - ఇదేనా కోర్టులకిచ్చే గౌరవం.. బాధ్యతారాహిత్యం ఉపేక్షించబోం - మీపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పండి - ముఖ్య కార్యదర్శికి నోటీసులు.. విచారణ వచ్చే వారానికి వాయిదా సాక్షి, హైదరాబాద్: ‘కోర్టులంటే జోక్ అయిపోయిందా? నివేదికివ్వాలని ఆదేశిస్తే, ఏవో రెండు కాగితాలు తీసుకుని కోర్టు ముఖం మీద కొడితే సరిపోతుందనుకుంటున్నారా? ఇదేనా కోర్టులకిచ్చే గౌరవం? ఇంత నిర్లక్ష్య వైఖరా?’ అంటూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బోరు బావుల్లో పడి చిన్నారులు మృతి చెందుతున్న ఘటనలు ఎక్కువవుతుండటంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. బోరు బావుల ఘటనలు పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో.. దాన్ని కోర్టు ధిక్కారం కింద ఎందుకు పరిగణించకూడదో స్పష్టంగా చెప్పాలంటూ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్గత డాక్యుమెంట్ సమర్పించారు: న్యాయవాది బోరు బావుల తవ్వకాలు, నిరుపయోగంగా మారిన బోరు బావుల పూడ్చివేత విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో న్యాయవాది బుద్ధారపు ప్రకాశ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. బోరుబావుల ఘటనలు పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని రెవెన్యూ ముఖ్య కార్యదర్శిని గత విచారణ సందర్భంగా కోర్టు ఆదేశించిందని ధర్మాసనానికి గుర్తు చేశారు. అయితే నివేదిక సమర్పించకుండా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, విపత్తుల నిర్వహణ కమిషనర్ మధ్య జరిగిన అంతర్గత డాక్యుమెంట్‌ను కోర్టుకు సమర్పించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తమ ముందున్న కాగితాలను పరిశీలించిన ధర్మాసనం.. రెవెన్యూ ముఖ్య కార్యదర్శిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.