సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక శాఖలో ఖాళీగా ఉన్న 11 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌వో) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని టీఎస్‌పీఎస్సీకి సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.