సాక్షి, హైదరాబాద్: ఒక సర్వే ప్రకారం రాష్ట్రంలో ని 3.35 లక్షల కార్మికుల్లో రెండు లక్షల మందిని ప్రభుత్వం ఆదుకుంటే మిగతా వారి సంగతి ఏ మిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాక్‌డౌన్‌లో రెండు లక్షల మందికి షెల్టర్లలో వసతులు కల్పించడం అభినందనీయమేనని, అయి తే మిగతా వలస కార్మికుల మాటేమిటో తెలియజేయాలని ఆదేశించింది. మే 6లోగా ప్రభుత్వం నివేదిక సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. ప్రజల ప్రాణాలను ముఖ్యం గా జీవనోపాధి కోసం వచ్చిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, ఇది రాజ్యాంగం నిర్దేశించిందని ధర్మాసనం గుర్తుచేసింది. 2 లక్షల మంది వరకూ షెల్టర్లల్లో వసతి, భోజన సదుపాయాలు కల్పిం చామని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ చెప్పా రు. లాక్‌డౌన్ వల్ల వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ల న్యాయవాదులు చె ప్పారు. కామారెడ్డిలో ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారని తెలిపారు. విచారణ మే 6కి వా యిదా పడింది. కాగా, పీపీఈ కిట్లు, ఎన్95 మా స్క్‌లు, శానిటైజర్లు, గ్లౌజ్‌లు ఎన్ని అవసరమో, ఎన్ని అందుబాటులో ఉన్నాయో నివేదికలు తెప్పించుకుని వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment