
ఐటీ రీఫండ్ వ్యవధి 15 రోజులకు కుదింపు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రీఫండ్‌లకు సంబంధించిన ఫిర్యాదులు పెరిగిపోతున్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రీఫండ్ కేసుల ప్రాసెసింగ్‌ను నిర్దేశిత 30 రోజుల్లో గాకుండా 15 రోజుల్లోనే పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగానికి సూచించింది.