న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (అసెస్‌మెంట్ సంవత్సరం 2023–24) ఆదాయపన్ను రిటర్నుల పత్రాలను (ఐటీఆర్‌లు) ఆదాయపన్ను శాఖ అత్యున్నత విభాగమైన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. వీటిల్లో తమకు వర్తించే ఐటీఆర్‌ను పన్ను చెల్లింపుదారులు దాఖలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తులు, నిపుణులు, వ్యాపారస్థులు ఇలా వివిధ విభాగాల్లోని వారికి మొత్తం ఆరు రకాల ఐటీఆర్‌లు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే వీటిల్లో పెద్దగా మార్పులు చేయలేదు.
ఐటీఆర్ 1 నుంచి ఐటీఆర్ 6 వరకు, ఐటీఆర్ – వీ (వెరిఫికేషన్ ఫామ్), ఐటీఆర్ అక్‌నాలెడ్జ్‌మెంట్ ఫామ్ నోటిఫై చేసిన వాటిల్లో ఉన్నాయి. ఈ పత్రాల ఆధారంగా రిటర్నుల దాఖలుకు సన్నద్ధమయ్యేందుకు పన్ను చెల్లింపుదారులకు తగినంత సమయం ఉంటుంది. ఏటా మార్చి లేదా ఏప్రిల్‌లో ఐటీఆర్‌లను నోటిఫై చేస్తుండగా, ఈ ఏడాది ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఐటీఆర్–1లో సెక్షన్ 139(1) కింద వెల్లడించాల్సి వివరాల్లో మార్పులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment