
విజయవాడ,సాక్షి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్(ఈసీ) బుధవారం(ఏప్రిల్10) నోటీసులు ఇచ్చింది. అనకాపల్లి ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి స్కాం స్టార్, లాండ్ గ్రాబర్, సాండ్ అండ్ లిక్కర్ ఎంపరర్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పవన్‌కల్యాణ్‌కు ఈసీ నోటీసులిచ్చింది.
పవన్ వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్‌కు ఏప్రిల్ 8న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధంగా పవన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యాఖ్యలను పరిశీలించిన ఈసీ, వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరింది.
ఇదీ చదవండి.. చంద్రబాబు నెంబర్‌వన్ కిలాడీ
Comments
Please login to add a commentAdd a comment