
సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పచ్చ మూక రెచ్చిపోతోంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఎల్లో బ్యాచ్ అరాచకం సృష్టించింది.
ప్రకాశం జిల్లాలోని పొదిలిలో టీడీపీ కార్యకర్తలు బరితెగించి దాడులు చేశారు. పొదిలిలోని నవామిట్టలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కుటుంబంపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా క్రూరత్వంతో రాళ్లు, కర్రలతో కొట్టారు. పచ్చ మూక దాడిలో కుటుంబంలోని ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో, వారికి వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక, ఈ దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లగా అక్కడ వారిని అడ్డుకొని వీరంగం సృష్టించారు.
ఇది కూడా చదవండి: శ్రీవారి లడ్డూపై వివాదం.. బాబు పక్కా స్కెచ్‌తోనే..
Comments
Please login to add a commentAdd a comment